పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి దాదాపు 3 ఏళ్ళ తరువాత వచ్చిన చిత్రం 'వకీల్ సాబ్'.ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎంతగానో ఎదురు చూశారు. ఇక బాలీవుడ్లో  అమితాబ్ బచ్చన్ నటించిన సూపర్ హిట్ సినిమా 'పింక్' కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎంసిఏ ఫేమ్ వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేసాడు. 'శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్' బ్యానర్ పై దిల్ రాజు, బోణి కపూర్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. శృతీ హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో నివేదా థామస్, అంజలి, అనన్య నాగెళ్ళ వంటి భామలు కూడా కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 9న విడుదలైన ఈ చిత్రానికి హిట్ టాక్ లభించింది. దాంతో ఫస్ట్ వీకెండ్ ను బాగానే క్యాష్ చేసుకుంది. ఆ తరువాత రెండు రోజులు కూడా పర్వాలేదు అనిపించింది. కానీ అటు తరువాత నుండీ కరోనా పరిస్థితి అలాగే టికెట్స్ రేట్లు తగ్గడం వలన ఈ చిత్రం కలెక్షన్లు బాగా డౌన్ అయ్యాయి.



ఇక తాజాగా అందిన రిపోర్ట్స్ ప్రకారం వకీల్ సాబ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..12 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 83.88 కోట్ల షేర్ ను రాబట్టింది. 'వకీల్ సాబ్' చిత్రానికి 89.85కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 90.5కోట్ల వరకూ షేర్ ను రాబట్టాలి.కాబట్టి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 90.5కోట్ల వరకూ షేర్ ను రాబట్టాలి.ఇక ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరో 6.62 కోట్ల షేర్ ను రాబట్టాలి. కాని తాజా పరిస్థితులు చూస్తుంటే ఈ సినిమా అంత రాబట్టడం కష్టమని చెప్పాలి. ఎందుకంటే కరోనా ఉధృతి ఎక్కువగా వుంది. అది కాక తెలంగాణాలో ఈరోజు నుంచి మూత పడ్డాయి కూడా. ఇక ఇన్ని సమస్యలు ఉండటం వలన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టంగా కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: