భారత్ లో కరోనా విజృంభణకు ఏ పనీ సక్రమంగా కాలేదు. ముఖ్యంగా చిత్ర పరిశ్రమ గడ్డు పరిశ్రమను ఎదుర్కొంది. ఆసక్తిగా షూటింగ్ కు వెళితే భయపెట్టి ఇంటికి వెళ్లగొట్టింది కరోనా. దీంతో అనుకున్న సమయానికి షూటింగ్ లు జరుగలేదు. దీంతో ఫిక్స్ చేసుకున్న డేట్ కు ప్లాన్ చేసుకున్న సినిమాలు రాక ఫుల్ డిసప్పాయింట్ అయ్యారు సినీ దర్శక, నిర్మాతలు, నటులు. మరోవైపు ఆ సినిమాలు ఎప్పుడు చూద్దామా  అని వెయిట్ చేసిన ప్రేక్షకులకు సైతం నిరాశే ఎదురైంది.

అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం విషయంలోనూ ఇదే జరుగుతోంది. అయితే దానికి కారణం కరోనా కాకపోయినా.. మరో సినిమా కావడం విశేషం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ -క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిలిం హరి హర వీరమల్లు.ఈ ప్రాజెక్ట్  టీజర్ తో అంచనాలను అమాంతం పెంచేసింది. పవన్ గెటప్, కాస్ట్యూమ్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు.

సంక్రాంతికి ప్లాన్ చేసుకున్న సినిమా కావడంతో అందుకు తగ్గట్టుగా షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నారు. కానీ కరోనా కారణంగా ప్లాన్ చేసినట్లుగా ఏదీ జరగడం లేదు. దీంతో ఈ సినిమా సంక్రాంతికి రాదనే వార్తలు వచ్చాయి. వీటిని ఖండిస్తూ నిర్మాత ఏ ఎమ్ రత్నం స్టేట్ మెంట్ ఇచ్చారు. సినిమా అనుకున్న సమయానికి వచ్చి తీరుతుందని ప్రకటించారు. కానీ ఇప్పుడు ప్లాన్స్ అన్నీ మారిపోయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. దానికి కారణం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ అని తెలుస్తోంది.


పవన్ కళ్యాణ్ ముందుగా ‘ఏకే’ రీమేక్ ను విడుదల చేస్తే బాగుంటుందని భావించాడు.ఈ విషయమై దర్శకుడు క్రిష్ తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. రెండు చిత్రాల దర్శకనిర్మాతలు ఒక మాట మీదకు రావడంతో ఇప్పుడు ‘హరిహర వీరమల్లు’ సినిమాను వాయిదా వేయనున్నారు. కాబట్టి వచ్చే సంక్రాంతికి ‘హరిహర వీరమల్లు’ రాకపోయినా.. ‘ఏకే’ రీమేక్ మాత్రం రెడీగా ఉంటుందని అర్థమవుతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: