అయితే టాలీవుడ్లో స్టార్ హీరోల సరసన హీరోయిన్ లు లేకుండా నిర్మించాలంటే అది చాలా అరుదనే చెప్పవచ్చు.. అందులో మెగాస్టార్ వంటి హీరోలు జోడి లేకుండా అసలు సినిమాలు చేస్తున్నారు అంటే ఎవరూ ఊహించలేరు. కానీ ప్రస్తుతం చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో హీరోయిన్ లేకుండానే నటిస్తూ వస్తున్నారట. తాజాగా ఆచార్య సినిమాలో ముందుగా కాజల్ ని హీరోయిన్ గా అనుకోని కోన్ని రోజులు షూటింగ్ చేసి ఆ తర్వాత ఆమె పాత్రను పూర్తిగా తొలగించారు. ఈ విషయంపై చిత్ర బృందం ఇటీవల క్లారిటీ కూడా ఇచ్చింది.
అయితే ఆచార్య సినిమాలో హీరోయిన్ ని పెట్టి రొమాన్స్ చేయడం వల్ల పాత్ర దెబ్బ తినే అవకాశం ఉండడంతో కాజల్ పాత్ర ను తొలగించామని ఇటీవలే తెలియజేశారు. ఈ చిత్రంలో చిరంజీవి కి జోడీగా హీరోయిన్ లేకుండానే ఈ సినిమా విడుదల అవుతుంది అని తెలియజేశాడు. ఇక డైరెక్టర్ మోహన్ రాజ్ దర్శకత్వంలో వస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో కూడా హీరోయిన్ లేదనే టాక్ వినిపిస్తోంది. ఇక మెహర్ రమేష్ డైరెక్షన్ లో వస్తున్న బోళా శంకర్. అయితే బాబు డైరెక్షన్లో వస్తున్న సినిమాలో మాత్రం శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నది. అయితే మిగిలిన చిత్రాలలో హీరో కే ఎక్కువ ప్రాధాన్యత ఉండడంతో అందులో కథానాయిక తీసివేయడం జరిగినట్లు సమాచారం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి