ఎప్పుడైనా సినిమా వాళ్ళ మీద సామాన్యులకు ఆసక్తి బాగా ఎక్కువగా ఉంటుంది. వారు ఏం చేస్తారు? ఏం తింటారు? లాంటి విషయాల మీద ఎక్కువగా ధ్యాస చూపిస్తూ ఉంటారు. అందుకే సినిమా అవకాశాలు రాని భామలు అందరూ ఇప్పుడు సోషల్ మీడియా బాటనే పడుతున్నారు.


సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు, వీడియోలు షేర్ చేయడం ద్వారా మళ్ళీ వార్తల్లో నిలుస్తూ క్రేజ్ సంపాదించి తద్వారా మళ్ళీ సినిమాల్లో మెరవాలని చూస్తున్నారుట.అందులో భాగంగానే సినీ పరిశ్రమకు దూరంగా ఉంటూ ఈ మధ్యనే రీ ఎంట్రీ ఇచ్చిన వాణి కపూర్ తాజాగా హాట్ ఫోటో షూట్ పోస్ట్ చేసింది. ఈ ఫోటో షూట్ లో ఆమె ఎద అందాలు ఆరబోస్తూ రచ్చ చేసింది. 
 

వాణి కపూర్ తండ్రి శివ కపూర్ ఢిల్లీలో ఒక ఫర్నిచర్ ఎక్స్పోర్ట్ కంపెనీ నడిపేవారట. దీంతో వాణి కపూర్ ఢిల్లీలో తన పాఠశాల విద్య పూర్తి చేసుకుని తర్వాత ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా టూరిజంలో బ్యాచిలర్ డిగ్రీ సంపాదించిందట.ఆ తర్వాత సినిమాల మీద ఆసక్తితో ఆమె మోడల్ అయ్యే ప్రయత్నం కూడా చేసింది.


అలా ఆమె యష్ రాజ్ ఫిలింస్ సంస్థ ద్వారా ఒకేసారి మూడు సినిమాలకు సంతకాలు చేసింది. శుద్ధ్ దేశీ రొమాన్స్ సినిమాతో తన కెరీర్ ప్రారంభించిన ఆమె ఆ సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్, పరిణీతి చోప్రా లతో కలిసి నటించి మెప్పించింది.

 


ఇక ఈ శుద్ధ్ దేశీ రొమాన్స్ సినిమాకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు కూడా దక్కాయి. అందులో వాణీ కపూర్ నటించిన తార పాత్రకి సైతం మంచి స్పందన కూడా లభించింది. దానికి తగ్గట్టే సినిమా కమర్షియల్ గా సక్సెస్ కావడంతో ఆమెకు కూడా మంచి పేరు కూడా వచ్చింది. ఆ తర్వాత 2010వ సంవత్సరంలో హిందీలో తెరకెక్కి సూపర్ హిట్ గా నిలిచిన బ్యాండ్ బాజా బారాత్ అనే సినిమాను తమిళంలో నాని హీరోగా, వాణి హీరోయిన్ గా తెరకెక్కించారట.దానిని తమిళం, తెలుగు భాషల్లో ఆహా కళ్యాణం పేరుతో విడుదల కూడా చేశారు. 


కానీ ఈ సినిమాతో మంచి పేరు అయితే దక్కలేదు. సినిమా బాగా ఆడకపోవడంతో వాణి కపూర్ కి కూడా పెద్దగా వర్కౌట్ కాలేదట. ఆ తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకుని ఆమె బేఫికరే అనే సినిమాలో ఆమె కనిపించింది. ఈ సినిమా కూడా ఆమెకు కలిసి రాకపోవడంతో సినిమాలకు కొంత గ్యాప్ తీసుకున్న ఆమె ఏకంగా మూడు ఏళ్ల పాటు సైలెంట్ అయిపోయిందట.. గ్యాప్ తీసుకున్న తర్వాత ఆమె హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటించిన వార్ సినిమా ద్వారా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిందట.

 


సినిమా సూపర్ హిట్ సక్సెస్ కావడంతో ఆమెకు మళ్ళీ సినిమా అవకాశాలు రావడం మొదలయ్యాయి ఈ నేపథ్యంలోనే ఆమె 2021 సంవత్సరం లో బెల్-బాటం, చండీగఢ్ కరే ఆషికీఅనే రెండు సినిమాల్లో కూడా కనిపించింది. ఈ మధ్య కాలంలో ఆమె సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అవుతోంది. యాక్టివ్ అవ్వడమే కాక సోషల్ మీడియాలో చేస్తున్న హాట్ షో చేస్తూ అంతటా చర్చనీయాంశం అవుతోంది.

 


మొన్నీమధ్య టూ పీస్ బికినీ ధరించి బీచ్ ఒడ్డున హొయలు పోతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కాగా ఒక ఘాటు ఫోటో షూట్ కూడా వదిలింది. ఆమె ఈ ఫొటోలో అయితే ఎద అందాలు ఆరబోస్తూ హాట్ గా కనిపిస్తుంది. ఈ ఫోటో షూట్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: