కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసారా చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. వశిష్ట మల్లిడి దర్శకుడిగా పరిచయమైనా ఈ సినిమా చారిత్రాత్మ క నేపథ్యంలో రూపొందిన సినిమా కాగా దీనికి ప్రేక్షకులలో మంచి అంచనాలు ఉన్నాయి. అనుకున్న విధంగానే ఈ సినిమా కు సంచలన విజయం  అందుకోవడంతో ఇప్పుడు ఈ సినిమాను ఇతర భాషలలోకి విడుదల చేసేందుకు హీరో నిర్మాత కళ్యాణ్ రామ్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలలోనే కళ్యాణ్ రామ్ ఈ సినిమాను ఇతర భాషలలో విడుదల చేసే విషయమై ఓ నిర్ణయం తీసుకున్నాడు. 

ముందుగా ఈ సినిమా తెలుగులో మంచి అప్లాజ్ దక్కించుకుంటే తప్పకుండా ఇతర భాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సంకోచించను అని ఆయ న వెల్లడించారు. అనుకున్న విధంగానే ఈ సినిమా కు మంచి గుర్తింపు కూడా వచ్చింది. కలెక్షన్స్ ఎలా వస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేవలం నాలుగు రోజుల్లోనే సినిమా పెట్టుబడి వచ్చేసింది. ఇకపై వచ్చే ప్రతీది కూడా మంచి కలెక్షన్స్ అని చెప్పాలి. 

ఆ విధంగా ఆయన చెప్పిన విధంగానే ఈ సినిమా హిందీలో డిమాండ్ పెరిగిపోతుంది. అక్కడ ఈ సినిమాను డబ్ చేసి విడుదల చేసే విధంగా సన్నాహాలు చే స్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రాన్ని హిందీలో కూడా చూడొచ్చు. దాంతో నందమూరి అభిమానులు తమ అభిమాన నటుడు పాన్ ఇండియా వైడ్ గా హీరోగా మారడానికి క్రేజీ తెచ్చుకోవడా నికి సిద్ధమవుతున్నాడని ఆనందపడుతున్నారు. మరి తెలుగులో ఇంతటి భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా హిందీలో ఎటువంటి పేరును తెచ్చుకుంటుందో చూడాలి. ఈ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ చేస్తున్న డెవిల్ సినిమా తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా పై ప్రేక్షకులలో మంచి అంచ నాలు ఇప్పు డు ఏర్పడ్డాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: