టాలీవుడ్ స్టార్ హీరో జనసేనాని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు గత కొంత కొపన్నినెలలుగా స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ నుంచి రానున్న క్రేజీ అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు.పవన్ కల్యాణ్ తో హరీష్ శంకర్ `భవదీయుడు భగత్ సింగ్`పేరుతో ఓ భారీ ప్రాజెక్ట్ ని రూపొందించనున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ని ప్రకటించి ఏడాది కావస్తోంది. అయితే పవన్ వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా వుండటం వల్ల ఈ సినిమా పట్టాలెక్కడానికి సమయం పడుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మించాలని ప్లాన్ చేస్తున్నా ముందుకు కదలడం లేదు.హరీష్ శంకర్ పవన్ కలయికలో `గబ్బర్ సింగ్` వంటి బ్లాక్ బస్టర్ తీసిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి ఈ ఇద్దరు జతకట్టబోతున్నారని తెలియడంతో పవర్ స్టార్ అభిమానులు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా? భగత్ సింగ్ పాత్రలో పవన్ ని హరీష్ శంకర్ ఎలా చూపించబోతున్నాడా? అని గత కొన్ని నెలలుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ `భవదీయుడు భగత్ సింగ్` సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే పవన్ కళ్యాణ్ వరుస రీమేక్ లపై దృష్టి పెట్టడం.. క్రిష్ తో చేస్తున్న `హరి హర వీరమల్లు` ఇంకా అండర్ ప్రొడక్షన్ లోనే వుండటంతో హరీష్ శంకర్ తన సినిమా కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.


అంతే కాకుండా ఇక `భవదీయుడు భగత్ సింగ్` పట్టాలెక్కడం కష్టమనే సంకేతాలు వినిపించాయి. అంతే కాకుండా నెలల తరబడి పవన్ కళ్యాణ్ కోసం ఎదురుచూస్తూ విలువైన సమయాన్ని వృధా చేసుకోవడానికి హరీష్ శంకర్ కూడా సిద్ధంగా లేడని మరో హీరోతో మరో ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడంటూ వరుస గాసిప్స్ వినిపించాయి.దీంతో `భవదీయుడు భగత్ సింగ్` ఇప్పట్లో లేనట్లే అని అంతా భావించారు. పవన్ ఫ్యాన్స్ కూడా ఈ ప్రాజెక్ట్ కోసం వచ్చే ఏడాది కోసం ఎదురుచూడాల్సిందే అంటూ నిట్టూర్చారు. అయితే పవన్ ఫ్యాన్స్ కు గురువారం హరీష్ శంకర్ అదరిపోయే న్యూస్ ఇచ్చేశాడు. గురువారం పూజా హెగ్డే పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా తనకు శుభాకాంక్షలు అందజేస్తూ హరీష్ శంకర్ చేసిన పోస్ట్ పవన్ ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తోంది.పూజా హెగ్డేకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసిన హరీష్ శంకర్ త్వరలో నీతో కలిసి సెట్స్ లో వర్క్ చేయడానికి ఎదురుచూస్తున్నానంటూ `భవదీయుడు భగత్ సింగ్` ప్రాజెక్ట్ పై ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో పవర్ స్టార్ అభిమానులు ఫుల్ హ్యాపీగా వున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: