తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం సినిమాలలో నటిస్తున్న స్టార్ హీరోల అందరిలో నంబర్ వన్ డ్యాన్సర్ ఎవరనే ప్రశ్నకు చిరంజీవి పేరు గట్టిగా వినిపిస్తుంది.

వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవి డ్యాన్స్ లు అద్భుతంగా ఉన్నాయనే విషయం తెలిసిందే. చిరంజీవి తర్వాత బెస్ట్ డ్యాన్సర్ ఎవరని అడిగితే కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ పేరు సమాధానంగా చెబితే మరి కొందరు అల్లు అర్జున్ అని కొందరు రాంచరణ్ అని పేరు సమాధానంగా చెబుతారు.

అయితే ప్రముఖ కొరియోగ్రాఫర్  అయిన సుచిత్ర మాట్లాడుతూ స్టైల్ విషయంలో చిరంజీవి గారిని రీప్లేస్ చేసేది ఎవరనే ప్రశ్నకు జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పగలనని సుచిత్ర అన్నారని సమాచారం.ఎలాంటి డ్యాన్స్ మూమెంట్ అయిన చేయాలన్నా ఎన్టీఆర్ చేయగలడని సుచిత్ర కామెంట్లు కూడా చేశారు. అల్లు అర్జున్ ఎంతో యూనిక్ గా డ్యాన్స్ చేస్తారని అయితే ఒకరిని ఇంకొకరితో పోల్చకూడదని కూడా ఆమె తెలిపారు. ఎన్టీఆర్, అల్లు అర్జున్ మరియు రాంచరణ్ ఎవరికి వాళ్లు వాళ్ళ సొంత యూనిక్ నెస్ ను కలిగి ఉన్నారని కూడా సుచిత్ర అన్నారు.

ఇచ్చిన కంపోజింగ్ ను సులువుగా అర్ధం చేసుకునే ప్రతిభ అందరు హీరోలలో ఉందని ఆమె కామెంట్లు కూడా చేశారు. తనను తాను బిల్డ్ చేసుకునే విషయంలో అల్లు అర్జున్ ఎంతో గ్రేట్ అని సుచిత్ర అన్నారు. నితిన్ కూడా అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నారని ఆమె తెలిపారు. కొన్ని సినిమాలలో కథ బాలేదని కొన్ని సినిమాలకు కథ బాగున్నా సాంగ్స్ బాగుండటం లేదని సుచిత్ర తెలిపారు

నేను పని చేసిన వాళ్లలో చిరంజీవి గారే బెస్ట్ డ్యాన్సర్ అని బ్యాడ్ డ్యాన్సర్ అని ఎవరి గురించి కూడా చెప్పలేనని ఆమె కామెంట్లు చేశారు. కొంతమంది డ్యాన్స్ సరిగ్గా చేయకపోయినా ఆ డ్యాన్స్ ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే ఎంతో గ్రేట్ అని సుచిత్ర తెలిపారు. ఎవరైనా కూడా బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తారని ఆమె కామెంట్లు చేశారు. సీనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ గురించి సుచిత్ర మాట్లాడుతూ అప్పట్లో ఆ డ్యాన్స్ వేరేలా ఉండేదని సుచిత్ర  చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: