ప్రస్తుతం మహేష్ ... త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ క్రేజీ మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతుంది. ఈ మూవీ మహేష్ కెరియర్ లో 28 వ సినిమాగా తెరకెక్కుతోంది. ఇప్పటి వరకు ఈ మూవీ కి చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ యూనిట్ ఈ సినిమా యొక్క షూటింగ్ "ఎస్ ఎస్ ఎం బి 28" అనే వర్కింగ్ టైటిల్ తో ఫుల్ స్పీడ్ లో పూర్తి చేస్తుంది.

మూవీ లో మహేష్ సరసన పూజా హెగ్డే ... శ్రీ లీల హీరోయిన్ లుగా కనిపించనున్నారు. ఇది వరకే పూజా హెగ్డే ... మహేష్ తో కలిసి మహర్షి మూవీ లో నటించింది. ఈ మూవీ లో వీరి జంటకు మంచి గుర్తింపు లభించింది. మహేష్ కు పూజ తో ఇది రెండవ సినిమా. ఇది ఇలా ఉంటే మహేష్ ... శ్రీ లీల మొట్ట మొదటి సారి ఈ మూవీ లోనే కలిసి నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ లో మలయాళ నటుడు జయరామ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ నుండి కొన్ని పిక్స్ బయటకు వచ్చాయి. అందులో మహేష్ , త్రివిక్రమ్ , జయరామ్ లు ఉన్నారు. దానితో ప్రస్తుతం మహేష్ మరియు జయరామ్ ల మధ్య ఈ మూవీ యూనిట్ చాలా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ లో మహేష్ ఇది వరకు మూవీ ల కంటే చాలా మాస్ పాత్రలో కనిపించబోతున్నట్లు ... అలాగే ఈ మూవీ లో ఫైట్స్ సన్ని వేషాలు కూడా అదిరిపోయే మాస్ రేంజ్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం ఉగాది రోజున ఈ మూవీ యొక్క టైటిల్ ను ఈ చిత్ర బృందం విడుదల చేయనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: