ఒకప్పుడు సెలబ్రెటీలకు, సామాన్యులకు మధ్య కమ్యూనికేషన్ అనేది అస్సలు ఉండకపోయేది. ఎప్పుడైతే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిందో అప్పటినుండి సెలబ్రెటీలకు, సామాన్యులకు మధ్య మంచి కమ్యూనికేషన్ ఏర్పడింది.

అలా సామాన్యులు తమ అభిమాన సెలబ్రెటీలకు సలహాలు ఇస్తూ వస్తున్నారు. అప్పుడప్పుడు వాళ్ళని దూషించాలన్నా కూడా సోషల్ మీడియాను బాగా వాడుతున్నారు. అలా ప్రతి విషయంలో వారికి ఈ వేదిక బాగా అలవాటు అయ్యింది. అయితే తాజాగా యాంకర్ రవి ని కూడా ఒక నెటిజన్ ఒక మాట అనడంతో వెంటనే రవి మరోలా స్పందించాడు. ఇంతకూ అతడు ఏమన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం.

టాలీవుడ్ బుల్లితెరపై యాంకర్ గా ఓ గుర్తింపు సొంతం చేసుకున్నాడు యాంకర్ రవి. తన యాంకరింగ్ తో మంచి అభిమానం సంపాదించుకొని బుల్లితెరపై ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు. కేవలం బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై కూడా నటుడుగా పరిచయమయ్యాడు.రవి తొలిసారిగా సంథింగ్ స్పెషల్ షోతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. వన్ షో, డీ జూనియర్స్, ఫ్యామిలీ సర్కస్ పటాస్ వంటి ఎన్నో ఎంటర్టైన్మెంట్స్ షో లలో యాంకర్ గా చేసి మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. పలు సినీ ఈవెంట్లలో కూడా యాంకర్ గా చేశాడు. ఇక తనకు బుల్లితెర పై క్రేజ్ ఎక్కువగా ఉండటంతో ఏకంగా బిగ్ బాస్ సీజన్ 5 లో అవకాశం అందుకున్నాడు. ఇక ఈ షోలో యాంకర్ రవి కాస్త నెగిటివిటీ ని కూడా సంపాదించుకున్నాడు. హౌస్ లో ఉన్నంతకాలం బాగా ట్రోల్స్ కూడా ఎదుర్కొన్నాడు.ఇక యాంకర్ రవికి నిత్య అనే అమ్మాయితో పెళ్లి జరగగా వాళ్లకి వియా అనే పాప కూడా ఉంది. ఇక వీరిని సోషల్ మీడియా వేదికగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు యాంకర్ రవి. వాళ్ళు కూడా బుల్లితెరపై పలు షోలలో వచ్చి బాగా సందడి చేశారు.రవి సోషల్ మీడియాలో కూడా ఫుల్ బిజీ గా మారాడు. నిత్యం ఏదో ఒక పోస్ట్ తో బాగా సందడి చేస్తూ ఉంటాడు. పైగా తన కూతురుతో చేసిన అల్లర్ల వీడియోలు కూడా పంచుకుంటాడు. ఇక ఇదంతా పక్కన పెడితే రీసెంట్గా తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ట్రిప్ కు వెళ్లి బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపించాడు రవి. ఇక దానికి సంబంధించిన ఫోటోలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా తన ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ఫొటోస్ పంచుకోగా ఆ ఫొటోస్ చూసి తన ఫ్యాన్స్ బాగా లైక్స్ కొడుతున్నారు. క్యూట్ ఫ్యామిలీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఓ నెటిజన్.. వామ్మో.. ఇది నమ్మలేకపోతున్నా.. ఇంత యంగ్ అబ్బాయికి ఇంత పెద్ద ఫ్యామిలీనా అంటూ ఆశ్చర్యంగా కామెంట్ చేయగా.. వెంటనే రవి అతడిని ట్యాగ్ చేసి.. టూ మచ్ కదా భయ్యా అంటూ రిప్లై ఇచ్చాడు. అంటే అతడు రవిని యంగ్ అబ్బాయిగా పోల్చడంతో రవి తన విషయంలో ఇది చాలా ఎక్కువైంది అన్నట్లు కౌంటర్ ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: