రీసెంట్ గా పెద్ద అంచనాలు లేకుండా మలయాళం లో విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సినిమాలలో ప్రేమలు మూవీ ఒకటి. ఈ సినిమా మొదటగా పెద్దగా అంచనాలు లేకుండా మలయాళం లో విడుదల అయింది. విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే ఈ సినిమాకు మలయాళ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన సూపర్ పాజిటివ్ టాక్ దక్కింది. దానితో ఈ మూవీ కలెక్షన్ లు రోజు రోజుకు పెరిగాయి. ఈ మూవీ అక్కడ బ్రేక్ ఈవెన్ ఫార్మలా ను కంప్లీట్ చేసుకుని భారీ లాభాలను అందుకుంది. ఇలా మలయాళం లో ఈ సినిమా భారీ లాభాలను అందుకుంటు ప్రేక్షకులను ఎంత గానో అలరిస్తూ ముందుకు దూసుకుపోతూ ఉండడంతో ఈ మూవీ ని ఎస్ ఎస్ కార్తికేయ కొన్ని రోజుల క్రితమే తెలుగు లో భారీ ఎత్తున విడుదల చేశాడు. ఇకపోతే ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకుల నుండి కూడా మంచి పాజిటివ్ టాక్ లభించింది. 

దానితో ఈ మూవీ తెలుగు వర్షన్ కి కూడా సూపర్ సాలిడ్ కలెక్షన్ లు ప్రపంచ వ్యాప్తంగా దక్కుతున్నాయి. ఇప్పటి వరకు  ఈ సినిమా తెలుగు వర్షన్  పది రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ పది రోజుల్లో ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ సాలిడ్ కలెక్షన్ లు దక్కాయి. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా తెలుగు వర్షన్ కి పది రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో దక్కిన కలెక్షన్ లకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ను విడుదల చేసారు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క తెలుగు వర్షన్ కి ప్రపంచ వ్యాప్తంగా పది రోజుల్లో 10.54 కోట్ల కలెక్షన్ లు దక్కినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: