హిందీ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అమీర్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించాడు. ఇకపోతే అమీర్ ఖాన్ హీరో గా రూపొందిన సినిమాలలో బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకున్న మూవీలలో లగాన్ మూవీ ఒకటి. క్రికెట్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకొని అమీర్ ఖాన్ సినిమాలలో బ్లాక్ బస్టర్ మూవీ లిస్ట్ లో చేరిపోయింది. తాజాగా అమీర్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా అమీర్ ఖాన్ "లగాన్" మూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

తాజా ఇంటర్వ్యూలో భాగంగా అమీర్ ఖాన్ మాట్లాడుతూ ... లగాన్ మూవీ ని తెరకెక్కిస్తున్నప్పుడు ఎందుకు నువ్వు ఈ సినిమా చేస్తున్నావు. ఈ సినిమా అస్సలు వర్కౌట్ కాదు. ఒక్క రోజు కూడా థియేటర్లలో ఆడదు అని అన్నారు. అలాగే అప్పటి వరకు క్రికెట్ నేపథ్యంలో ఎంతో గొప్పగా తెరకెక్కించిన సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టలేదు. అమితా బచ్చన్ "లగాన్" మూవీ కి వాయిస్ ఓవర్ ఇచ్చాడు.

అమితా బచ్చన్ వాయిస్ ఓవర్ ఇచ్చిన సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అవుతాయి అనే ఓ నెగటివ్ వార్త కూడా వైరల్ అయింది. ఇక ఇలా అనేక నెగిటివ్ అంశాల మధ్య విడుదల అయిన లగాన్ మూవీ అదిరిపోయి రేంజ్ విజయాన్ని అందుకొని భారీ విజయాన్ని సొంతం చేసుకుంది అని అమీర్ ఖాన్ తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు. కాకపోతే 2001 వ సంవత్సరం భారీ అంచనాల నడమ విడుదల అయిన లగాన్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: