ఈ మధ్య కాలంలో నాచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన సినిమాలకు సీడెడ్ ఏరియాలో పెద్ద ఎత్తున ఫ్రీ రిలీజ్ బిజినెస్లు జరుగుతూ వస్తున్నాయి. కానీ నాని సీడెడ్ ఏరియాలో సక్సెస్ ఫుల్ గా బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకోవడంలో మాత్రం కాస్త విఫలం అవుతున్నాడు అని చెప్పవచ్చు. అసలు విషయం లోకి వెళితే ... కొంత కాలం క్రితం నాని , శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన దసరా అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

దానితో ఈ మూవీ కి సీడెడ్ ఏరియాలో దాదాపు 6.50 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి సీడెడ్ ఏరియాలో 5.32 షేర్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. దానితో ఈ మూవీ సీడెడ్ ఏరియాలో కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది. నాని ఆఖరుగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన సరిపోదా శనివారం అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ కి సీడెడ్ ఏరియాలో దాదాపు 5 కోట్ల మేర ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక సీడెడ్ ఏరియాలో ఈ మూవీ టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి 4.04 కోట్ల షేర్ కలెక్షన్లను మాత్రమే వసూలు చేసింది.

దానితో ఈ సినిమా కూడా సీడెడ్ ఏరియాలో బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకోలేకపోయింది. నాని తాజాగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన హిట్ ది థర్డ్ కేస్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు సీడెడ్ ఏరియాలో 5.40 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా సీడెడ్ ఏరియాలో బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకొని హిట్ స్టేటస్లు అందుకుంటుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: