
అంతేకాదు బాలీవుడ్ హీరోలు సిక్స్ ప్యాక్స్ తో అల్లాడించేస్తున్న ఆ టైంలో ఆమె ఇలా చేయడం టాలీవుడ్ హీరోలకి కాదు టాలీవుడ్ అభిమానులకు కూడా కోపం తెప్పించింది. అయితే బన్నీ మాత్రం చాలా సైలెంట్ గా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళాడు . ఎవరు ఊహించని విధంగా దేశముదురు సినిమాతో సిక్స్ ప్యాక్స్ ను చూపించాడు. నిజానికి బన్ని తర్వాతే మిగతా స్టార్స్ కూడా సిక్స్ ప్యాక్ లు చేయడం మొదలుపెట్టారు . తెలుగు హీరోలు కూడా ఫిజిక్ పై కాన్సన్ట్రేషన్ చేస్తారు అని తెలుగు హీరోలు ఏది అనుకున్న సాధించగలరు అని ప్రూవ్ చేశాడు బన్నీ .
ఆ హీరోయిన్ పై కోపంతోనే సిక్స్ ప్యాక్స్ చేశాడు అంటూ ఓ ఇంటర్వ్యూలో పరోక్షకంగానే చెప్పుకొచ్చాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. దానికి సంబంధించిన వార్తలను మరొకసారి వైరల్ చేస్తున్నారు బన్నీ అభిమానులు . ప్రజెంట్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా కోసం బిజీ బిజీగా ముందుకు వెళ్తున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నాడట అల్లు అర్జున్. ఈ సినిమాతో మరోక ఆస్కార్ ని ఇండియన్ ఫిలిం హిస్టరికి తీసుకోని రాబోతున్నారు అంటూ కూడా టాక్ వినిపిస్తుంది..!