న్యాచురల్ స్టార్ నాని హిట్3 సినిమాతో మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నాలుగు రోజుల్లో ఏకంగా 101 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. దసరా, సరిపోదా శనివారం సినిమాల తర్వాత 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం పార్టీలు జరుగుతాయని నాని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
 
బాలీవుడ్ లో హీరోలు వీకెండ్ లో కలిసి పార్టీలు చేసుకుంటారు. అదే విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం పార్టీలు జరుగుతాయని నాని అన్నారు. బాలీవుడ్ లో ఉన్న రేంజ్ లో టాలీవుడ్ ఇండస్ట్రీలో పార్టీ కల్చర్ లేదని న్యాచురల్ స్టార్ పేర్కొన్నారు. అప్పుడప్పుడూ మేము పార్టీలు చేసుకుంటామని ఆయన తెలిపారు. మా పార్టీలు అలా పైకి కనిపించవని నాని వెల్లడించడం గమనార్హం.
 
మేము చేసుకునే పార్టీలను బయటికి చూపించాలని అనుకోమని నాని వెల్లడించారు. మ్యాగ్జిమమ్ ఇళ్లలోనే మా పార్టీలు ఉంటాయని మేము డ్రింక్ చేస్తామని డిన్నర్ చేస్తామని ఆయన పేర్కొన్నారు. న్యాచురల్ స్టార్ నాని హిట్3 సినిమా సక్సెస్ తో ఇండస్ట్రీకి సైతం ఊపునిచ్చారు. సమ్మర్ హాలిడేస్ ను ఈ సినిమా బాగానే క్యాష్ చేసుకునే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
న్యాచురల్ స్టార్ నాని ది ప్యారడైజ్ సినిమాతో ఏ రేంజ్ లో హిట్ సంపాదించుకుంటారో చూడాల్సి ఉంది. న్యాచురల్ స్టార్ నాని శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాతో దసరా సినిమాను మించిన మ్యాజిక్ చేయడం పక్కా అని కామెంట్లు వినిపిస్తున్నాయి. నాని భవిష్యత్తు సినిమాలతో భారీ విజయాలను అందుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. నాని ఒక్కో మెట్టు ఎదుగుతూ కెరీర్ పరంగా ప్రశంసలు అందుకుంటున్నారు. నాని టైర్1 హీరోల జాబితాలో చేరడానికి ఎంతో సమయం పట్టదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: