దివంగత సినీ నటుడు శోభన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ హీరో తన కెరీర్ లో ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. శోభన్ బాబు తెలుగు సినిమా ఇండస్ట్రీని తన ఒంటి చేతితో ఏలాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. శోభన్ బాబు 220 కి పైగా సినిమాలలో నటించి తనకంటూ గొప్ప పేరును సంపాదించుకున్నాడు. ఈ హీరోని సోగ్గాడు అని ముద్దుగా పిలుచుకునేవారు. మోహన్ బాబు 2008 మార్చి 24న ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. మోహన్ బాబు మన మధ్య లేకపోవడం నిజంగా బాధాకరం. 


తాను లేకపోయినా అతని సినిమాలతో అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. కాగా, శోభన్ బాబు కుమార్తె మృదుల కుమారుడు సురక్షిత్ బత్తిన సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్. సురక్షిత్ బత్తిన వైద్య రంగంలో ఓ అరుదైన శస్త్ర చికిత్స చేసి గిన్నిస్ రికార్డును బ్రేక్ చేశారు. ఇటీవలే ఇతడు చెన్నైలో ట్రూ 3డీ ల్యాపరోస్కోపిక్ ద్వారా తమిళనాడుకు చెందిన 44 ఏళ్ల మహిళకు శరీరంలో భారీ కణితి ఉన్న 4.5 కిలోల గర్భాశయాన్ని తొలగించాడు.

సురక్షిత్ బత్తిన గురువు డాక్టర్ సిన్హ 2019లో 4.1 కిలోల గర్భాశయాన్ని ల్యాపరోస్కోపి శస్త్ర చికిత్స ద్వారా తొలగించి గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో స్థానం పొందగా ఇప్పుడు సురక్షిత్ బత్తిన తన గురువు రికార్డుని క్రాస్ చేసి గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డులో మరో అరుదైన ఘనతను సాధించాడు. ఆ మహిళను ప్రాణాలతో కాపాడడంతో  సురక్షిత్ బత్తినపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఓ వైపు వైద్యరంగం నుంచి మరోవైపు ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఓ గొప్ప అరుదైన వైద్యుడిగా సురక్షిత్ బత్తిన గొప్ప పేరును అందుకోవడం విశేషం. సురక్షిత్ చేసిన గొప్ప పనికి వైద్యరంగంలోని ప్రతి ఒక్క వైద్యుడు ఎంతగానో అభినందిస్తున్నారు. ఆ మహిళ కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: