ప్రస్తుతం థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాల కన్నా ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలే ఎక్కువ ఉన్నాయి. ఈ క్రమంలో ప్రతి వారం థియేటర్లలో, ఓటీటీలో ఏ కంటెంట్ రిలీజ్ అవుతుంది అనే విషయం మీద ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ప్రతివారం మంచి పాపులర్ సినిమాలు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదల అయ్యి.. హిట్ టాక్ ని అందుకుంటాయి. అటు తెలుగు, ఇటు హిందీతో పాటుగా కన్నడ, తమిళం, మలయాళం సినిమాలు కూడా అందుబాటులోకి వస్తాయి.

అయితే ఈ వేసవి సెలవులలో ప్రేక్షకులను వినోదాన్ని పంచేందుకు సూపర్ మూవీస్ తో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలో డైరెక్టర్ వెట్రిమారన్ సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ సినిమాలు సామాజిక అంశాలపైన రూపొందించినవి. అందులో అసలు మిస్ అవ్వకుండా చూడాల్సిన 7 సినిమాలు ఉన్నాయి. మరి ఆ మూవీస్ ఏంటో.. ఏ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయో ఇప్పుడు చూద్దాం.

తమిళ డైరెక్టర్ వెట్రిమారన్ తెరకెక్కించిన అసూరన్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో హీరో ధనుష్ మెయిన్ రోల్ లో నటించారు. ఈ సినిమా మంచి హిట్ ని దక్కించుకుంది. వడా చెన్నై సినిమా సోనీ లీవ్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ఆడుతోంది. ఈ సినిమాలో కూడా హీరోగా ధనుష్ నటించారు. ఆడు కాలం మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అయిన సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా 6 జాతీయ అవార్డులను దక్కించుకుంది. ఈ మూవీలో కూడా స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటించారు. విడుదల పార్ట్ 1, విడుదల పార్ట్ 2 సినిమాలు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉన్నాయి. ఈ సినిమాలలో విజయ్ సేతుపతి కిలక పాత్రలో కనిపించారు. ఈ మూవీస్ మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకున్నాయి. అలాగే విసారనై సినిమా నెట్ ఫ్లిక్స్ లో చూడొచ్చు. ఈ మూవీలో దినేష్, ఆనంది, కిషోర్, మురగదాస్ లు కీలక పాత్రలలో నటించారు. పొల్లధవన్ సినిమా సన్ నెక్స్ట్ ఓటీటీలో ఆడుతోంది. ఈ సినిమాలో హీరో ధనుష్ నటించారు. ఈ మూవీ మంచి యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కి హిట్ కొట్టింది.


మరింత సమాచారం తెలుసుకోండి: