
మనకు తెలిసిందే రామ్ చరణ్ ప్రజెంట్ బుచ్చిబాబు దర్శకత్వంలో "పెద్ది" అనే సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమాకి సంబంధించిన ఒక్క అప్డేట్ రిలీజ్ అయినా సరే మెగా ఫాన్స్ ఆనందానికి అవధులు ఉండవు . అంతలా ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు మెగా ఫ్యాన్స్. కాగా రీసెంట్గా రాంచరణ్ ఈ సినిమాకి సంబంధించిన ఒక అప్డేట్ ఇచ్చి అభిమానులకి పూనకాలు వచ్చేలా చేసాడు . ప్రజెంట్ రామ్ చరణ్ లండన్ లో ఉన్నారు. మేడమ్ టూస్సాడ్స్ లో మైనపు విగ్రహావిష్కరణ నేపథ్యంలో వెళ్లిన చరణ్.. అక్కడే రాయల్ ఆల్బర్ట్ హాల్లో ఆర్ఆర్ఆర్ లైవ్ కన్సర్ట్ లో పాల్గొన్నారు .
పెద్ది సినిమా గురించి కీలక అప్డేట్ ఇచ్చారు. "సినిమా ఆల్రెడీ 30% షూటింగ్ కంప్లీట్ అయిపోయింది అని .. కచ్చితంగా ఈ సినిమా రంగస్థలం కంటే చాలా చాలా బెటర్ గా ఉంటూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది " అంటూ మాట్లాడారు . అయితే చరణ్ అప్డేట్ ఇవ్వడం పట్ల ఫ్యాన్స్ హ్యాపీగానే ఉన్న రంగస్థలం కంటే బెటర్ గా ఉంటుంది అని చెప్పి సుకుమార్ ఫ్యాన్స్ ని హర్ట్ చేశాడు. రంగస్థలం సినిమా చరణ్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ . ఆయన మరో 100 జన్మలెత్తిన సరే రంగస్థలం సినిమాలోని క్యారెక్టర్ ఆయనకి రాదు అనేది సుకుమార్ ఫ్యాన్స్ అభిప్రాయం . మరి అలాంటి సుకుమార్ డైరెక్ట్ చేసిన రంగస్థలం సినిమా ని ఈ విధంగా తక్కువ చేసి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు . మరి కొంతమంది దారుణాతి దారుణంగా సెన్స్ లేదా..? నమ్మకద్రోహి అంటూ ఘాటుగా కామెంట్స్ పెడుతున్నారు..!