ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కెరియర్ లో ఎన్నో సినిమాల్లో నటించి ఎన్నో మూవీలతో మంచి విజయాలను అందుకున్న ఈయన సరైన విజయాన్ని అందుకొని చాలా కాలం అవుతుంది. ఆఖరుగా ఈయన నటించిన ది వారియర్ , స్కంద , డబుల్ ఇస్మార్ట్ మూవీలు వరుసగా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇలా వరుస అపజయాలతో డీలా పడిపోయిన రామ్ ప్రస్తుతం మహేష్ బాబు పి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి మేకర్స్ ఇప్పటివరకు టైటిల్ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ యొక్క షూటింగ్ను రాపో 22 అనే వర్కింగ్ టైటిల్ తో మేకర్స్ పూర్తి చేస్తూ వస్తున్నారు.

మూవీ లో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... ఉపేంద్ర ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇకపోతే ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లీమ్స్ వీడియోను మే 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ఈ మూవీ కి మేకర్స్ టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి ఆంధ్ర కింగ్ తాలూకా అనే టైటిల్ను మేకర్స్ ఫిక్స్ చేసినట్లు , దీనినే మే 15 వ తేదీన అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తుంది.

ఇది ఇలా ఉంటే వరుస ఫ్లాప్ లతో డీలా పడిపోయిన రామ్మూవీ పై భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కనుక మంచి విజయం సాధించినట్లయితే మళ్లీ రామ్ తిరిగి ఫుల్ ఫామ్ లోకి వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. మరి ఈ మూవీ తో రామ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: