పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక ఆయనపై విమర్శలు బాగా పెరిగిపోయాయి. కొంతమంది ఆయన అంటే పడినవారు టార్గెట్ చేసి మరీ సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా నిర్మాత చిట్టి బాబు పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆయన తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ పై సంచలనం వ్యాఖ్యలు చేశారు. నిర్మాత చిట్టిబాబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఓ అబద్దాల కోరి. ఆయన అధికారంలోకి రాకముందు ఒకలా మాట్లాడారు. వచ్చాక ఒకలా మాట్లాడుతున్నారు. అధికారంలోకి రాకముందు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు 32,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారంటూ తన దగ్గర ఓ అధికారి చెప్పినట్టు మాట్లాడారు.కానీ అధికారంలోకి వచ్చాక ఆ 32,000 మంది అమ్మాయిలు ఎక్కడా..బండి సంజయ్ చెప్పడంతో ఏదీ లేదు అని అదంతా ఉత్తదే అన్నట్లుగా మాట్లాడారు. 

అలాగే కాకినాడలో గంజాయి దొరుకుతుంది అని చెప్పారు. కానీ ఆయన అధికారంలోకి వచ్చాక అదంతా డ్రై ఐస్ అంటూ పోలీసులు తేల్చేసారు అంటూ కవర్ చేసుకున్నారు.అలాగే హిందువుల వల్లే ఈ మతకల్లోలన్నీ అని అధికారంలోకి రాక ముందు చెప్పారు. కానీ ఎప్పుడైతే బిజెపితో పొత్తు పెట్టుకున్నారో అప్పటినుండి మళ్ళీ సనాతన ధర్మం అంటూ చెప్పుకొని తిరుగుతున్నారు.ఇలా అధికారంలోకి రాకముందు ఒకలా వచ్చాక మరోలా అబద్ధాలు మాట్లాడుతూ పబ్బం గడుపుతున్నారు. నోరు తెరిస్తే అబద్ధాలే అసలు అది నాలుకా తాటి మట్టా.. ఆయన అధికారంలోకి రావడం కోసం ఇతరులపై విమర్శలు చేశారు. పాచిపోయిన లడ్డు అంటూ ఎంతో విమర్శించారు. అయితే మొదట్లో నేను కూడా పవన్ కళ్యాణ్ ని బాగా నమ్మాను.

కానీ ఇప్పుడు ఆయనపై పూర్తిగా నమ్మకం పోయింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులను మోసం చేసింది పవన్ కళ్యాణే. ఆయన వల్లే వారికి ఆ గతి పట్టింది. పబ్లిక్ మీటింగ్లలో ఆవేశంగా అందరూ అట్రాక్ట్ అయ్యేలా మాట్లాడుతావు. కానీ నీ సొంత నియోజకవర్గంలో రేప్ జరిగితే దాని గురించి కనీసం స్పందించలేదు.ఇక ఆయన మాట్లాడింది చూసుకుంటే అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ అలా ఇతరులను ఇరుకున్న పెట్టడానికి మాట్లాడారని అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ ఎన్ని అబద్ధాలు చెబుతారో అర్థమైంది అంటూ నిర్మాత చిట్టిబాబు పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు కొంతమంది. ఇక చిట్టిబాబు చేసిన వ్యాఖ్యలపై కొంతమంది సపోర్ట్ చేస్తే మరి కొంతమంది విమర్శిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: