
ఇదిలా ఉండగా.. ఈ మధ్యకాలంలో హీరోయిన్ లు అందంగా కనిపించడం కోసం ఎన్నో సర్జరీలు చేయించుకుంటున్నారు. సినిమాలో ఆఫర్స్ రావడం కోసం మంచి లుక్ ని క్రియేట్ చేసుకోవడం కోసం ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ కోవలోనే నటి అనుష్క శర్మ కూడా వెళ్ళినట్లు గతంలో వార్తలు వచ్చాయి. 2014లో కరణ్ జోహార్ షోకి అనుష్క శర్మ అతిథిగా వెళ్లింది. ఆ సమయంలో ఆమెలో తేడాలు కనిపించాయి. ఆమె పెదవులకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు చాలా వార్తలు వచ్చాయి.
దీంతో అనుష్క శర్మ స్వయంగా ఆ విషయంపై క్లారిటీ ఇచ్చింది. అయితే తన లిప్స్ పెద్దగా కనిపించేందుకు ఆమె సర్జరీ చేయించుకుందని వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని తెలిపింది. తను ఎలాంటి సర్జరీ చేసుకోలేదని స్పష్టం చేసింది. తన పెదాలు అందంగా కనిపించేందుకు అనుష్క శర్మ తాత్కాలికంగా పెదవులను పెంచే ఒక సాధనాన్ని ఉపయోగిస్తున్నట్లు వెల్లడించింది. అలాగే కొన్ని మేకప్ పద్ధతులను సైతం పాటిస్తున్నట్లు చెప్పింది. అందువల్లే తన పెదవులు కొంచెం అందంగా కనిపిస్తున్నాయని.. అంతకుమించి ఏం లేదని క్లారిటీ ఇచ్చింది. తను ఎలాంటి శాస్త్ర చికిత్స చేసుకోలేదని సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేసింది. అలాగే తనకు సర్జరీ వల్ల గ్లామర్ పెరుగుతుందని నమ్మకం లేదని, అందుకే ఎప్పటికీ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోనని అనుష్క శర్మ చెప్పుకొచ్చింది.