పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలం క్రితం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే భారీ బడ్జెట్ మూవీ ని మొదలు పెట్టిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మొదలు అయిన తర్వాత అనేక కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ చాలా సార్లు ఆగిపోయింది. ఈ మూవీ మొదలు పెట్టిన తర్వాత పవన్ స్టార్ట్ చేసిన బీమ్లా నాయక్ , బ్రో సినిమాలు ఇప్పటికే విడుదల అయ్యి కూడా చాలా కాలం అవుతుంది. ఈ సినిమా షూటింగ్ పలు మార్లు స్టార్ట్ అవుతూ ఆగిపోవడంతో ఈ మూవీ దర్శకత్వ బాధ్యతల నుండి క్రిష్ జాగర్లమూడి తప్పకున్నాడు. దానితో ఈ మూవీ కి సంబంధించిన మిగిలిన భాగాన్ని జ్యోతి కృష్ణ అనే దర్శకుడు పూర్తి చేశాడు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు ప్రకటించారు. ఈ సినిమా యొక్క మొదటి భాగాన్ని జూన్ 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు తాజాగా ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని పాటలను మేకర్స్ విడుదల చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఈ మూవీ నుండి మూడవ సాంగ్ ను విడుదల చేయడానికి మేకర్స్ రెడీ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మే 21 వ తేదీన ఈ మూవీలోని మూడవ సాంగ్ నీ విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం వారు ఉన్నట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఏ ఎం రత్నం ఈ మూవీ ని నిర్మించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: