టాలీవుడ్ లో ఉన్నప్పుడు స్టార్ హీరోగా నటించిన వారిలో కమలహాసన్ కూడా ఒకరు. ప్రస్తుతం ఆయన సీనియర్ హీరో అయినప్పటికీ కుర్ర హీరోలకు సైతం ఇండస్ట్రీలో పోటీ ఇస్తున్నారు. నిజానికి కమల్ హాసన్ తమిళ హీరో అయినప్పటికీ తెలుగులోను ఆయనకు అభిమానులు ఉన్నారు. ఆయన తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. భారతీయుడు సినిమాలో కమలహాసన్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే మిస్ కాకుండా చూస్తుంటారు.  

అదేవిధంగా దశావతారంలో కమల్ హాసన్ 10 పాత్రలలో నటించడం ద్వారా నటరాజు అనిపించుకున్నారు. ఇలా కమల్ కేరీలో ఎన్నో గొప్ప సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక సినిమాల్లో కమలహాసన్ ఎంతో సక్సెస్ ఫుల్ హీరో అని చెప్పచ్చు.
అయితే  కమల్ హాసన్ ప్రస్తుతం థగ్ లైఫ్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్ గా త్రిష నటిస్తున్నారు. అలాగే థగ్ లైఫ్ సినిమాలో హీరో శింబు కూడా ముఖ్యపాత్ర పోషించనున్నారు. ఈ మూవీలో ఐశ్వర్య లక్ష్మి, సానియా మల్హోత్రా, జోజు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా వచ్చే నెల 5వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

 
సినిమా గ్యాంగ్ స్టార్ చరిత్రను చూపించే విధంగా రూపొందింది. ఇటీవలే థగ్ లైఫ్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ లో కమల్ హాసన్ యాక్షన్ సీన్స్ తో ఇరగదీశారు. అలాగే కమల్ హాసన్ హీరోయిన్ త్రిషతో మేడం ఐ యామ్ యువర్ ఓన్లీ ఆడమ్ అంటూ మాట్లాడిన ఒక సీన్ కూడా ఈ ట్రైలర్ లో చూపించారు. అంతేకాకుండా కమల్ హాసన్, హీరోయిన్ త్రిష లిప్స్ కి కిస్ పెట్టే సీను కూడా ఉంది. ఇక ఆ సీన్ చూసిన నెటిజన్స్ కమల్ హాసన్ ని తెగ ట్రోల్ చేస్తున్నారు. కమల్ హాసన్ కి త్రిషకి మధ్య కనీసం 30 ఏళ్ల వయసు తేడా ఉంటుందని అంటున్నారు. వారిద్దరి మధ్య రొమాన్స్ సీన్స్ ఏంటని ట్రోలింగ్ చేస్తున్నారు. అలాగే తమిళ వర్సెస్ తెలుగు అంటూ నెట్టింట రచ్చ కూడా మొదలైంది. ఇక ఇది ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: