ఈ మధ్యకాలంలో స్టార్ హీరోస్ ఒక్కొక్క సినిమా చేస్తున్నందుకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అనే విషయం అందరికీ తెలిసిందే.  కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటూ తమ పేరుకి ఇంకా పబ్లిసిటీ క్రియేట్ చేసుకుంటున్నారు.  కాగా ఒక్కొక్క సినిమాకి 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకునే హీరోల లిస్టులో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉండడం గమనార్హం. ప్రెసెంట్ దేవర 2.. వార్ 2.. ఎన్టీఆర్ 31 సినిమాలతో బిజీగా ఉన్న తారక్ త్వరలోనే మరొక సెన్సేషనల్ డైరెక్టర్ తో సినిమాకి కమిట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి .

నేడు తారక్ పుట్టినరోజు.  ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ ఫ్రెండ్స్ శ్రేయోభిలాషులు సినీ ప్రముఖులు అందరు విష్ చేస్తున్నారు . తారక్ ఎప్పుడు సుఖసంతోషాలతో జీవించాలి అని ఆయన ఆరోగ్యం అంతా బాగుండాలి అంటూ బ్లెస్ చేస్తున్నారు . ఇలాంటి మూమెంట్లోనే తారక్ కి సంబంధించిన ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా బాగా ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు.  సాధారణంగా ఇండస్ట్రీలో ఏ హీరో అయిన గెస్ట్ పాత్రలో కనిపించిన డబ్బులు తీసుకుంటారు . కానీ తారక్ మాత్రం అలా కాదు "చింతకాయల రవి: సినిమాలో తారక్ గెస్ట్ పాత్రలో మెరుస్తారు .

ఒక్క నిమిషం పాటు స్టెప్ అలా వేసి ఇలా  మాయమైపోతాడు.  అయితే ఆ సినిమా కోసం ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదట . అప్పటికే తారక్ రేంజ్ వేరే లెవెల్ లో ఉంది . కచ్చితంగా డబ్బులు డిమాండ్ చేసి ఉండొచ్చు. డైరెక్టర్ కూడా డబ్బులు ఆఫర్ చేశారట . కానీ తారక్ మాత్రం ఫ్రెండ్షిప్ కారణంగా ఈ సినిమాను చేశారట.  ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ గా తీసుకోలేదట.  అప్పట్లో ఈ న్యూస్ బాగా సెన్సేషనల్ గా మారింది . కేవలం వెంకటేష్ తో మాత్రమే కాదు ఇండస్ట్రీలో చాలామంది హీరోలతో మంచి ఫ్రెండ్షిప్ ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు హీరో తారక్..!
 

మరింత సమాచారం తెలుసుకోండి: