10 రోజులలో విడుదలకాబోతున్న ‘భైరవం’ మూవీ వరస పరాజయాలతో సతమతమైపోతున్న బెల్లంకొండ శ్రీనివాస్ కెరియర్ కు అత్యంత కీలకంగా మారింది. ఈ మూవీలో నారా రోహిత్ మంచు మనోజ్ లు కూడ నటించడంతో ఈమూవీ పై రోహిత్ తో పాటు మంచు మనోజ్ లు కూడ చాల ఆశలు పెట్టుకున్నాడు. ఈ మూవీ దర్శకుడు విజయ్ కనక మేడల ‘నాంది’ దర్శకుడు కావడంతో ఈమూవీలో ఈ విలక్షణ దర్శకుడు ఏదో ఒక మ్యాజిక్ చేసి ఉంటాడు అన్న అంచనాలు ఉన్నాయి.


ఇంతమంది కెరియర్ కు కీలకంగా మారిన ఈమూవీని ఈ ముగ్గురు హీరోలు వరసపెట్టి ప్రమోట్ చేస్తున్నారు. తమిళంలో విడుదలైన ‘గరుడన్’ మూవీకి రీమేక్ గా నిర్మాణం జరుపుకున్న ఈమూవీలో విజయ్ కనకమేడల చాల మార్పులు చేర్పులు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈమధ్య బెల్లం కొండ శ్రీనివాస్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈమూవీ పై కొన్ని ఆశక్తికర కామెంట్స్ చేశాడు.


ఈమూవీ తమిళ ‘గరుడన్’ కు రీమేక్ అయినప్పటికీ కేవలం ఆమూవీ స్టోరీ లైన్ మాత్రమే తీసుకుని దర్శకుడు అనేక మార్పులు చేర్పులు చేశాడని బెల్లంకొండ కామెంట్స్ చేశాడు. అంతేకాదు ఈమూవీ సూపర్ హిట్ అవ్వడం ఖాయం అంటూ ఈసినిమాకు వచ్చే ప్రేక్షకులు ‘కాంతారా’ సినిమాలోని స్పెషల్ ఎఫెక్ట్స్ ను మరోసారి చూసాము అన్న భావనతో ఈమూవీ నుండి బయటకు వస్తారు అంటూ మరిన్ని అంచనాలను బెల్లంకొండ పెంచుతున్నాడు.


ఈమూవీకి సంబంధించి దర్శకుడు ఫస్ట్ ఫ్రేమ్ నుంచి శుభం కార్డు దాకా ప్రతి ఒక్క సీన్ ఎపిసోడ్ ని డిఫరెంట్ గా వ్రాసుకున్నాడని బెల్లంకొండ అంటున్నాడు. నారా రోహిత్ మంచు మనోజ్ లతో తాను కలిసి నటిస్తున్నప్పుడు ఈసినిమా షూటింగ్ ఒక పండుగ వాతావరణంలా కొనసాగింది అని అంటున్నాడు. ఈసినిమా పై అంచనాలు బాగానే ఉన్నప్పటికీ జూన్ 1 నుండి తెలుగు రాష్ట్రాలలో ధియేటర్లు బంద్ కాబోతున్న పరిస్థితులలో ఈసినిమా నిజంగా విడుదల కాగలద అన్న సందేహాలు కొందరిలో ఉన్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: