
ఇక ఈ సినిమా పోస్టర్ లు, టీజర్ లు కూడా ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. ఈ సినిమా పాటలు కూడా మంచి స్పందన పొందాయి. దీంతో కన్నప్ప మూవీపైన ప్రేక్షకులు మరింత అంచనాలు పెరిగాయి. ఈ సినిమా కోసం మూవీ మేకర్స్ చాలానే ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ సినిమా తెలుగుతో పాటుగా తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ కానుంది.
అయితే కన్నప్ప సినిమా హార్డ్ డిస్క్ మిస్ అయిందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో సినీ ఇండస్ట్రీలో గందరగోళం మొదలైంది. ఈ నేపథ్యంలో హీరో మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. అందులో 'జటాజుఠదరి నీకోసం తపస్సు చేసే నాకెందుకు ఈ పరీక్ష స్వామి' అని విష్ణు రాసుకొచ్చారు. ఇది చూసిన నెటిజన్స్ హార్డ్ డిస్క్ మిస్ అవ్వడంతో ఈ ట్వీట్ పెట్టారని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ ట్వీట్ లో తనను శివుడు పరీక్షిస్తున్నాడనే ఉద్దేశంతో విష్ణు పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతొంది.