- ( టాలీవుడ్‌ - ఇండియా హెరాల్డ్ )

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో క్లారిటీ రావడంతో .. అభిమానులు ఇండస్ట్రీ జనాలు కూడా ఎంతో హ్యాపీగా ఉంటున్నారు .. ముఖ్యంగా పవన్ తో కలిసి నటిస్తున్న హీరోయిన్లు అప్ కమింగ్ సినిమాలతో తమ ఫేట్‌ మారుతుంది అన్న గట్టి ఆశతో ఉన్నారు .. అయితే ఇప్పుడు అలా వెయిటింగ్ లో ఉన్న హీరోయిన్స్‌ ఎవరో అనేది ఈ స్టోరీలో చూద్దాం .. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటిసారిగా పిరియాడిక్ రోల్‌లో నటిస్తున్న మూవీ హరిహర వీరమల్లు .. చాలా రోజులగా వాయిదా పడుతున్న ఈ సినిమా ఫైనల్ గా జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ..



ఇప్పటికే ప్రమోషన్లు మొదలుపెట్టిన మేకర్స్ ఆడియన్స్ తో పాటు ఇండస్ట్రీలోనూ కొత్త జోష్ ను నింపారు .. హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ తో హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు .. చాలా రోజులుగా స‌రైన‌ బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న ఈ బ్యూటీ పవన్ సినిమాతో తన ఆశ నెరవేరుతుందన్న నమ్మకంతో ఉన్నారు .. అలాగే ఓజి రిలీజ్ విషయంలోనూ ఓ క్లారిటీ రావడంతో ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ..

 

చాలా రోజులకు టాలీవుడ్ లో పెద్ద బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న ప్రియాంక .. ఓజీ తో తాను అనుకున్న బ్రేక్ వస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు .. అలాగే ఉస్తాద్ షూటింగ్ అప్డేట్ రావడం తో శ్రీలీల కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు .. మహేష్ సినిమా తర్వాత టాప్ లీగ్ ను టార్గెట్ చేసిన ఈ బ్యూటీ పవన్ సినిమా మీద భారీ ఆశలు పెట్టుకున్నారు .. ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ తర్వాత శ్రీ లీల కూడా నెంబర్ వన్ రేస్ లో అడుగుపెట్టడం ఖాయం అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు .

మరింత సమాచారం తెలుసుకోండి: