ఇప్పుడు ఇండస్ట్రీలో ఎలాంటి సిచువేషన్ నెలకొందో అందరికీ తెలిసిందే . ఒక హీరో సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఆ సినిమాకి సపోర్ట్ చేయకపోవడమే కాదు..సినిమాలను ఆపేసే విధంగానే పక్క స్కెచ్ తో కొంత మంది ముందుకు వెళ్తున్నారు.  అంతెందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమానే ఆపేయడానికి తెర వెనక ఎన్ని కుట్రలు జరిగాయి అనేది అందరికీ తెలిసిందే . పవన్ కళ్యాణ్ తన తెలివితేటలతో ఆ వ్యక్తి ఎవరు అన్న విషయాన్ని పక్కాగా బయటకు రాబట్టేశారు. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో కి ఇండస్ట్రిలో ఎలాంటి పరిస్థితి ఎదురయింది అంటే ఇక నార్మల్ హీరోల పరిస్థితి ఏంటి ..?? అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు .


సరిగ్గా ఇదే మూమెంట్లో గతంలో సీనియర్ ఎన్టీ రామారావు గారు చేసిన తప్పు గురించి కూడా మాట్లాడుకుంటున్నారు.  నేడు ఆయన జయంతి . ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ వార్తలను గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు . సోషల్ మీడియాలో సీనియర్ ఎన్టీ రామారావు గారికి సంబంధించిన వార్తలు బాగా ట్రెండ్ అవుతున్నాయి . సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు సీనియర్ రామారావు గారి గురించి మాట్లాడుకుంటున్నారు.  అయితే సీనియర్ రామారావు గారికి ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ రాలేదా..? అంటే వచ్చాయి . అది కూడా ఆయన తీసుకున్న రాంగ్ డెసీషన్ వల్ల అని చెప్పాలి . రామారావు గారు అంటే అందరికీ ప్రాణం . ఒక ఇష్టం .హీరోగా కాదు ఇంటి పెద్దదిక్కులా ..ఒక నాన్నలా ఒక అన్నలా ..ఒక మంచి మనిషిలా  చాలామంది ఆయనను అభిమానించే ఆరాధించే వాళ్ళు ఉన్నారు.



అయితే సీనియర్ ఎన్టీ రామారావు గారు కూడా తన సినిమాల విషయంలో ఓ రాంగ్ స్టెప్ తీసుకున్నాడు. మరి ముఖ్యంగా తనకి కాంపిటీటివ్ హీరో అయిన ఏఎన్ఆర్ విషయంలోనే కావడం గమనార్హం. ఎన్టీఆర్ - ఏఎన్ఆర్ కలిసి మల్టీ స్టారర్ సినిమాల్లో నటించే వాళ్ళు . అయితే ఆ సినిమాలు రిలీజ్ అయిన మూమెంట్ లో ఎన్టీఆర్ గొప్ప అంటే కొందరు ఏఎన్ఆర్ గొప్ప అంటూ వాళ్ళ మధ్య పుండులు పెట్టడానికి సినీ పెద్దలు చాలా ఎక్కువగానే ప్రయత్నించారు. అనుకున్నట్టే వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టేసారు. ఒకానొక మూమెంట్ లో అసలు ఎన్టీఆర్ ఏఎన్నార్ సంవత్సర కాలం పాటు మాట్లాడుకోలేదు అంటూ కూడా వార్తలు వినిపించాయి.



అంతేకాదు ఎన్టీఆర్ తో నటించే హీరోయిన్లు ఆయన సినిమాలను ప్రొడ్యూస్ చేసే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళు ఎవ్వరూ కూడా ఏఎన్ఆర్ తో నటించే ఛాన్స్ లేకుండా అప్పట్లో కొంతమంది సినిమాల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకున్నారట.  ఎన్టీఆర్ తో నటిస్తే ఏ ఎన్ ఆర్  సినిమాను ప్రొడ్యూస్ చేసేందుకు లేదు ..డిస్ట్రీబ్యూట్ చేసేందుకు లేదు . ఆ విధంగా ఒక రూల్ ని తీసుకొచ్చారట . ఈ విషయం ఎన్టీఆర్ కి కూడా తెలుసు కానీ ఎన్టీఆర్ వాటిని పెద్దగా పట్టించుకోలేదట.  కానీ ఏఎన్ఆర్ మాత్రం అలా చేస్తే మనకన్నా ముఖ్యంగా సినీ కార్మికుల నష్టపోతారు అంటూ చాలా సందర్భాలలో ఈ విధంగా చేయకుండా ఉండాలి అంటూ నిర్ణయించుకున్నారట . అయితే ఏఎన్ఆర్ స్పందించినంత గొప్పగా ఎన్టీఆర్ స్పందించలేకపోయాడు అన్న చిన్న నెగిటివ్ కామెంట్ ఆయన పై ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది .ఎన్టీఆర్ కెరియర్ లో ఏదైనా బిగ్ మిస్టేక్ చేసాడు అంటే అది ఇది మాత్రమే అంటూ కొంతమంది నందమూరి ఫ్యాన్ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: