టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ కు ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా సినిమాకు ప్రభాస్ మార్కెట్ పెరుగుతుండగా ప్రభాస్ భవిష్యత్తు సినిమాలతో సంచలనాలు సృష్టించాలని సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే స్టార్ హీరో ప్రభాస్ సినిమాలకు లీక్స్ వల్ల ఊహించని సమస్య ఎదురవుతోంది.
 
కొంతకాలం క్రితం కన్నప్ప సినిమాలో ప్రభాస్ లుక్ లీకైన సంగతి తెలిసిందే. తాజాగా రాజాసాబ్ సినిమాకు సంబంధించి ప్రభాస్ లుక్ ఒకటి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. ప్రభాస్ ఒక్కో సినిమాకు 120 కోట్ల రూపాయల నుంచి 150 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారనే సంగతి తెలిసిందే. ఈ రేంజ్ లో రెమ్యునరేషన్, క్రేజ్ ప్రభాస్ కు మాత్రమే సొంతమని చెప్పవచ్చు.
 
ప్రభాస్ భవిష్యత్తు సినిమాలు సరికొత్త రికార్డులతో పాటు సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ప్రభాస్ ది రాజాసాబ్ మూవీ ఈ ఏడాది డిసెంబర్ నెలలో థియేటర్లలో విడుదల కానుంది. ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండగా ఈ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
 
ప్రభాస్ త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను సైతం ప్రకటించనున్నారని తెలుస్తోంది. స్పిరిట్ సినిమాలో త్రిప్తీ దిమ్రీ నటిస్తున్నారు. ప్రభాస్ త్రిప్తి జోడీ బాగుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రభాస్ లుక్స్ విషయంలో కేర్ తీసుకుంటుండగా ప్రభాస్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. ది రాజాసాబ్ మూవీ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ది రాజసాబ్ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు కొత్తగా ఉండబోతున్నాయని తెలుస్తోంది. ప్రభాస్ ను అభిమానించే వాళ్ల సంఖ్య పెరుగుతోంది.







మరింత సమాచారం తెలుసుకోండి: