సౌత్ ఇండియాలోని సెన్సేషనల్ డైరెక్టర్లలో మణిరత్నం కూడా ఒకరు. మణిరత్నం సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు కోట్ల సంఖ్యలో ఉన్నారు. తన సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ఎన్నోసార్లు మ్యాజిక్ చేసిన మణిరత్నం కమల్ హాసన్, శింబు ప్రధాన పాత్రల్లో త్రిష హీరోయిన్ గా థగ్ లైఫ్ పేరుతో తెరకెక్కించిన మూవీ నేడు రికార్డ్ స్థాయి థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
 
కథ :
 
థగ్ లైఫ్ కథ రంగరాయ శక్తిరాజ్ (కమల్ హాసన్) అమర్ (శింబు) అనే రెండు ప్రధాన పాత్రల మధ్య జరిగే కథ. శక్తిరాజ్ శక్తివంతమైన గ్యాంగ్ స్టర్ కాగా అతను అమర్ ను ఎందుకు పెంచుతాడు? ఆ తర్వాత రోజుల్లో శక్తిరాజ్, అమర్ మధ్య గ్యాప్ ఎందుకు ఏర్పడుతుంది. శక్తి జీవితం తలక్రిందులు కావడానికి కారణమేంటి? ఈ కథను ఎలా ముగిస్తారనే అనే ప్రశ్నలకు సమాధానమే థగ్ లైఫ్.
 
విశ్లేషణ :
 
2 గంటల 45 నిమిషాల నిడివితో తెరకెక్కిన ఈ సినిమాలో ఫస్టాఫ్ అద్భుతంగా ఉండగా సెకండాఫ్ మాత్రం ఆ స్థాయిలో లేదు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఇప్పటికే పదుల సంఖ్యలో సినిమాలు తెరకెక్కగా కొత్త తరహా కథాంశం సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చదు. ఈ సినిమాలో శక్తి పాత్రలో కమల్ తన నట విశ్వరూపం చూపించారు. విక్రమ్ తర్వాత కమల్ ఈ సినిమాలో తన బెస్ట్ పర్ఫమెన్స్ ఇచ్చారు. కొన్ని సన్నివేశాల్లో యంగ్ లుక్ లో కమల్ ఆకట్టుకున్నారు.
 
శింబు పోషించిన అమర్ పాత్రకు సంబంధించి ఎన్నో వేరియేషన్స్ ఉండగా ఆ పాత్రలో శింబు ఒదిగిపోయారు. కమల్ శింబు కాంబినేషన్ సీన్స్ అన్నీ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. సినిమాలో త్రిష పోషించింది చిన్న పాత్రే అయినా ఆమె పాత్ర ప్రేక్షకులు గుర్తుంచుకునేలా మలచడంలో మణిరత్నం ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. షుగర్ బేబీ సాంగ్ లో ఆమె పర్ఫామెన్స్ ఆకట్టుకుంది. నాజర్, ఐశ్వర్య లక్ష్మి, మిగతా నటీనటులు పాత్ర పరిధిమేర నటించారు
 
మణిరత్నం ఎంచుకున్న స్టోరీ బాగానే ఉన్నా కథనం మాత్రం ఆకట్టుకునేలా లేదు. మణిరత్నం తన అనుభవంతో మంచి కథనే ఎంచుకున్నా ఈ జనరేషన్ ప్రేక్షకులు ఎలా తీసుకుంటారనే దానిపై తుది ఫలితం ఆధారపడి ఉంది.
 
టెక్నికల్ గా మాత్రం థగ్ లైఫ్ సినిమా హై రేంజ్ లో ఉందని చెప్పవచ్చు. ఏఆర్ రెహమాన్ పాటలు, బీజీఎం ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ విజువల్స్ అదిరిపోయేలా ఉండగా ఎడిటర్ సైతం తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు పెద్దపీట వేశారు. మణిరత్నం కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ సినిమా రేంజ్ మరింత పెరిగేది.
 
బలాలు : కమల్, శింబు యాక్టింగ్, ఫస్టాఫ్, కొన్ని యాక్షన్ సీన్స్, బీజీఎం
 
బలహీనతలు : రొటీన్ స్క్రీన్ ప్లే, సెకండాఫ్ లోని కొన్ని సన్నివేశాలు
 
రేటింగ్ : 2.75/5.0


మరింత సమాచారం తెలుసుకోండి: