
బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత శుభ శ్రీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్స్ ని పెంచుకునే పనిలో ఉన్నది. ఈ క్రమంలోనే తాజాగా ఇమే చేసిన ఒక పోస్ట్ అందరిని షాక్ కి గురిచేసింది. తన ప్రియుడు తో కలిసి ఎంగేజ్మెంట్ చేసుకున్న కొన్ని ఫోటోలను తెలియజేస్తూ ఫైనల్లీ వి ఆర్ ఎంగేజ్డ్ అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ విషయం చూసిన అభిమానులు మొదట ఆశ్చర్యపోయిన ఆ తర్వాత ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇక శుభ శ్రీ కాబోయే భర్త పేరు అజయ్ మైసూర్.. ఇతను సిని రంగంలో కూడా నటుడుగా, నిర్మాతగా రానిస్తున్నారట.. ముఖ్యంగా ఫ్యాక్షన్ సినిమాగా వచ్చిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ,టెన్త్ క్లాస్ డైరీస్ వంటి సినిమాలలో నటించారు. అయితే నటుడుగా పెద్దగా ఆకట్టుకోలేకపోయారు..జూన్ 5వ తేదీన వీరు నిశ్చితార్థ వేడుకలు జరిగినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కొన్ని ఫోటోలను శుభ శ్రీ తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. శుభ శ్రీ విషయానికి వస్తే ప్రస్తుతం సినిమా ఆఫర్స్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. అవకాశాలు రాకపోవడంతో పెళ్లికి సిద్ధమైనట్లుగా సమాచారం.