విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎంతగానో ఊరిస్తున్న చిత్రం `కింగ్‌డ‌మ్‌`. విజ‌య్ గ‌త చిత్రాలు `లైగ‌ర్‌`, `ఫ్యామిలీ స్టార్‌` చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద బొక్క బోర్లా ప‌డిన‌ప్ప‌టికీ.. కింగ్‌డ‌మ్ పై అంచ‌నాలు మాత్రం తారా స్థాయిలో ఏర్ప‌డ్డాయి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్ల‌ర్ ఇది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.


సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ క్రియేషన్స్ బ్యాన‌ర్ల‌పై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న కింగ్‌డ‌మ్‌ చిత్రం మే 30న విడుదల కావాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల జూలై 4వ తేదీకి విడుదలను పోస్ట్ పోన్ అయింది. అయితే విజ‌య్ ఫ్యాన్స్‌కి హార్ట్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే.. ఇప్పుడు ఆ తేదీకి కూడా సినిమా రావ‌డం క‌ష్ట‌మేన‌ట‌. అనిరుధ్ ర‌విచంద‌ర్ మ్యూజిక్ ప‌నులు ఇంకా కంప్లీట్ చేయ‌లేద‌ని.. అలాగే కొన్ని సీన్లు కూడా రీషూట్‌కు వెళ్లాల‌ని ఇప్ప‌టికే బ‌ల‌మైన టాక్ ఉంది.


ఈ నేప‌థ్యంలోనే కింగ్‌డ‌మ్ రిలీజ్ మరోసారి వాయిదా పడనుందంటూ సోష‌ల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. పైగా నితిన్ హీరోగా నటించిన `తమ్ముడు` మూవీ జూలై 4వ తేదీని లాక్ చేసుకోవడంతో నెట్టింట జ‌రుగుతున్న ప్రచారానికి మరింత బలం చేకూరింది. ఇక తాజా సమాచారం ప్రకారం.. జూలై 25న కింగ్‌డ‌మ్ చిత్రాన్ని వ‌ర‌ల్డ్ వైడ్‌గా పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ కొత్త రిలీజ్ డేట్ పై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: