టాలీవుడ్ లో ప్రేమ వివాహం చేసుకున్న సెల‌బ్రిటీల్లో వ‌రుణ్ తేజ్-లావ‌ణ్య త్రిపాఠి జంట ఒక‌టి. `మిస్ట‌ర్‌` మూవీతో వీరిద్ద‌రి మ‌ధ్య ఏర్ప‌డిన ప‌రిచ‌యం స్నేహంగా, ఆపై ప్రేమ‌గా మారింది. పెద్ద‌ల అంగీకారంతో 2023లో లావ‌ణ్య‌తో క‌లిసి వ‌రుణ్ ఏడ‌డుగులు వేశాడు. ఇట‌లీలో ఈ జంట డెస్టినేష‌న్ వెడ్డింగ్ చేసుకున్నారు. అనంత‌రం త‌మ అన్యోన్య దంప‌త్యంతో ఎంతో మందికి ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. అన్న‌ట్లు ప్ర‌స్తుతం లావ‌ణ్య ప్రెగ్నెంట్ గా ఉంది. దీంతో భార్య‌ను వ‌రుణ్ మ‌రింత కేరింగ్ గా చూసుకుంటున్నాడు. ఇటీవ‌లె ఆమె కోసం చెఫ్‌గా మారి పిజ్జా కూడా త‌యారు చేశాడు.


తాజాగా భ‌ర్త గురించి లావ‌ణ్య త్రిపాఠి మ‌రిన్ని ఇంట్రెస్టింగ్ బ‌య‌ట‌పెట్టింది. ఆమె డెబ్యూ ఫిల్మ్ `అందాల రాక్షసి` రీరిలీజ్ కు సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. హను రాఘవపూడి డైరెక్ట్ చేసిన ఈ ట్రైంగిల్ ల‌వ్ స్టోరీ 2012లో విడుద‌లై సూప‌ర్ డూప‌ర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ చిత్రాన్ని జూన్ 13న మ‌ళ్లీ థిట‌యేర్స్ లోకి తీసుకొస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే న‌వీన్ చంద్ర‌, రాహుల్ రవీంద్రన్‌ల‌తో క‌లిసి లావ‌ణ్య ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొంది.


ఇంట‌ర్వ్యూలో ఈ ముగ్గురు స్టార్స్ అందాల రాక్ష‌సి సినిమాకు సంబంధించిన విశేషాలే కాకుండా ప‌లు ప‌ర్స‌న‌ల్ లైఫ్ విష‌యాలు కూడా పంచుకున్నారు. ఈ క్ర‌మంలోనే వ‌రుణ్ తేజ్‌పై లావ‌ణ్య ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. `కెరీర్ స్టార్టింగ్ నుంచి నాకు ఒంట‌రిత‌నం అల‌వాటైపోయింది. కానీ వ‌రుణ్ వ‌చ్చాక లైఫ్ పూర్తిగా మారింది. అత‌న న‌న్ను అమ్మ‌లా చూసుకుంటాడు. టైమ్‌కి మెడిసిన్ ఇస్తాడు. త‌న చేత్తో గోరుముద్దులు పెడ‌తాడు. నేను అడ‌గ‌క‌పోయిన నాకోసం అన్ని చేసేస్తాడు` అంటూ లావ‌ణ్య‌ హ‌స్బెండ్‌ను ఆకాశానికి ఎత్తేసింది. ఆమె మాట‌ల‌తో అమ్మాయిలు కుల్లుకుంటుంటే.. మెగా ఫ్యాన్స్ మాత్రం భార్యంటే వ‌రుణ్‌కు ఎంత ప్రేమో అంటూ తెగ మురిసిపోతున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: