మరికొద్ది గంటల్లోనే గద్దర్ అవార్డ్స్ వేడుక ప్రారంభం కాబోతుంది. గత కొన్ని ఏళ్లు గా ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన గద్దర్ అవార్డ్స్ వేడుక మరికొద్ది గంటలోనే ప్రారంభం కాబోతుంది.  గద్దర్ అవార్డ్స్ వేడుకను చాలా ఘనంగా ఈసారి తెలంగాణ గవర్నమెంట్ ప్లాన్ చేసింది . అయితే అవార్డ్స్ తీసుకోవడం అనేది సినీస్టార్స్ కి పెద్దకొత్తెం కాదు . గతంలో చాలామంది ఇలా అవార్డ్స్ తీసుకునే ఉంటారు.  పెద్ద పెద్ద స్టేజ్  ఈవెంట్స్ లో కూడా మంచి మంచి అవార్డ్స్ తీసుకొని ఉంటారు . కానీ ఈసారి మాత్రం గద్దర్ అవార్డ్స్ ను చాలా స్పెషల్ గా క్రియేట్ చేస్తున్నారు జనాలు .

మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ . స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఉత్తమ నటుడుగా పుష్ప సినిమాకి గాను గద్దర్ అవార్డు అందుకోబోతున్నాడు . అయితే అల్లు అర్జున్ కి ఇది పెద్ద గొప్పా  అని అనుకోవచ్చు . నిజంగా ఇది గొప్పే.  ఎందుకంటే అల్లు అర్జున్ అవార్డు అందుకోబోయేది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదగా . మామూలుగా అయితే దీని పెద్ద రాద్ధాంతం  చేసేవారు కాదేమో అభిమానులు . అయితే పుష్ప2 సినిమా రిలీజ్ మూమెంట్ లో తొక్కిసలాట జరగడం ..అక్కడ ఓ మహిళ మృతి చెందడం దానికి కారణం అల్లు అర్జున్ అని అంటూ తెలంగాణ గవర్నమెంట్ ఆయనని  అరెస్ట్ చేయడం ఒకరోజు జైల్లో పెట్టడం ఆయన కెరియర్ కే కాదు ఆయన పర్సనల్ లైఫ్ ని బాగా డామేజ్ చేసింది.

ఇప్పుడు అలాంటి అల్లు అర్జున్ కె ఉత్తమ నటుడిగా తెలంగాణ ప్రభుత్వం అవార్డు ఇవ్వబోతుంది.  ఇది నిజంగా చాలా చాలా స్పెషల్ మూమెంట్ అంటున్నారు బన్నీ ఫ్యాన్స్. అంతేకాదు మనల్ని తిట్టినోడు మన నటనను మెచ్చుకొని మన పెర్ఫార్మన్స్ ని శభాష్ అని పొగిడితే ఆ కిక్కే వేరు అంటూ పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలో ఒక డైలాగ్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు . "నేను సింహం లాంటోడిని అది గడ్డం గీసుకోదు నేను గీసుకుంటా..మిగతాదంతా సేమ్ టు సేమ్" అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ ని అల్లు అర్జున్ పుష్ప సినిమాకి అప్లికేబుల్ చేస్తున్నారు . దీంతోసోషల్ మీడియాలో ఇప్పుడు అల్లు అర్జున్ - రేవంత్ రెడ్డి ల పేర్లు మారుమ్రోగిపోతున్నాయ్..!!


మరింత సమాచారం తెలుసుకోండి: