ఇక చిత్ర పరిశ్రమలో గత కొంతకాలంగా హీరోలు వారి రెమ్యునరేషన్ .. ఇలా వీటి చుట్టూనే ఇండస్ట్రీలో చాలా రోజులుగా చర్చలు జరుగుతూ వస్తున్నాయి .. అయితే ఈ విషయంలో నిర్మాతలు సరైన రూట్లో వెళ్తున్నారా ? లేక హీరోలను పిలిచి మరి కోట్లు ముట్ట చెబుతున్నారా ? అలాగే మార్కెట్ చూడకుండా పారితోషికాలు భారీగా పెంచేస్తున్నారా ? దిల్ రాజు మాటను పాటిస్తారా ? అసలేంటి నిర్మాతల సమస్య .. ఇక దానికి హీరోలు ఏం చేయాలి ? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం .. ప్రస్తుతం స్టార్ హీరోల రెమ్యునరేషన్స్ ఏ విధంగా ఉంటున్నాయో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు . హిట్ ప్లాప్‌లతో సంబంధం లేకుండా వారి పారితోషకాలు ఆకాశంలో ఉంటున్నాయి ..


ఇక మొన్నటికి మొన్న తెలంగాణ డిస్ట్రిబ్యూటర్ vi శ్రీధర్ కూడా ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు .. డిజాస్టర్ హీరోలకు కూడా పిలిచి మరి కోట్లు ఇస్తున్నారంటూ ఆయన చేసిన కామెంట్స్ ఎంతో వైరల్ గా మారాయి .. అయితే ఇదే క్రమంలో హీరోల రెమ్యునరేషన్స్ పై నిర్మాతల వాదన మరోలా ఉంది .. అయితే ఇక్కడ డిమాండ్ అంటే సప్లై నడుస్తుందని అంటున్నారు వారు .. పైగా హీరోలు మాకు దేవుళ్ళు వాళ్లకు ఎదురు చెప్పే ధైర్యం మాకు లేదు అని ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ అన్నారు .. ఇదే క్రమంలో ఇదే విషయం పై మరో నిర్మాత దిల్ రాజు వాదన మాత్రం మరలా ఉంది .. ఆయన మాట్లాడే తీరు ఆయన వ్యాఖ్యలు మిగిలిన వాళ్లకు ఎంతో భిన్నంగా ఉంటుంది .. నితిన్ హీరోగా నటిస్తున్న తమ్ముడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దిల్ రాజు మాటలు బాగా వైరల్ గా మారాయి .. రెమ్యూనరేషన్ విషయంలో హీరోలకు అర్థమయ్యేలా చెబితే వారు అర్థం చేసుకుంటారు అంటున్నాడు దిల్ రాజు ..


ఇక గతంలో బృందావనం సమయంలో ఎన్టీఆర్ , మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా సమయంలో ప్రభాస్ , వకీన్ సాబ్ సినిమా టైంలో పవన్ , ఇప్పుడు నితిన్ రెమ్యూనరేషన్ విషయంలో పరిస్థితులు అర్థం చేసుకున్నారని దిల్ రాజు చెప్పుకొచ్చాడు .. అలాగే ఇండస్ట్రీలో లాభ నష్టాలకు అతీతంగా మన హీరోలు ఉంటున్నారు ..అయితే సినిమాకి ముందు కొంత  రెమ్యునరేషన్ తీసుకుని సినిమా అయ్యాక మిగిలింది తీసుకుంటే బెటర్ అనేది దిల్ రాజు వాదన .. అలాగే సుకుమార్ , త్రివిక్రమ్ , రాజమౌళి లాంటి వారు ఇప్పటికే సినిమాలో వాటాను తీసుకుంటున్నారు .  కొందరు హీరోలు కూడా ఇదే రూటు ఫాలో అవుతున్నారు ..  అయితే ఇండస్ట్రీలో ఉన్నవారు అంత ఇదే రూట్ ను ఫాలో అయితే చిత్ర పరిశ్రమ బాగుంటుందని విశ్లేషకులు అంటున్నారు ..

మరింత సమాచారం తెలుసుకోండి: