- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

మెగాస్టార్ చిరంజీవి హీరోగా యు.వి క్రియేషన్స్ సంస్థ దాదాపు రు. 150 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా విశ్వంభర‌. దాదాపు మూడు సంవత్సరాలుగా సినిమా షూటింగ్ లో ఉంది. విశ్వంభ‌ర ఎప్పుడు వస్తుందో తెలియక అసలు వర్క్ ఎంత పెండింగ్లో ఉందో ? తెలియక మెగా అభిమానులు కింద మీదా అవుతున్నారు. మెగాస్టార్ చిరు తన తర్వాత సినిమా మీదకు కూడా వెళ్లిపోయారు. అనిల్ రావుపూడి డైరెక్షన్లో తెర‌కెక్కుతున్న ఆ సినిమా షూటింగ్ చక చకా నడుస్తోంది. మరో ఆరు నెలల్లో ఆ సినిమా రిలీజ్ కానుంది. పెద్ద హీరోల సినిమాల మధ్య కనీసం ఆరేడు నెలల గ్యాప్ ఉంటుంది. విశ్వంభ‌ర ఇప్పుడు రాకుండా మరో రెండు మూడు నెలలు ఆలస్యం అయితే రెండు సినిమాలుకు మంచి తేడా కేవలం 3 నెలలు మాత్రమే ఉంటుంది. సినిమా దాదాపు పూర్తయిందని అంటున్నారు.


అయితే ఒక‌ ఐటెం సాంగ్ పెండింగ్ అట. దీనికి సరైన హీరోయిన్‌ కావాలి. యంగ్ హీరోయిన్లను.. మరీ చిన్న అమ్మాయిని తీసుకుంటే ట్రోల్లింగ్ ఉంటుందని.. చిరు ప‌క్క‌న‌ సరిగ్గా సెట్ కాదేమో అన్న అనుమానం ఉంది. మెగాస్టార్ పక్కన మ్యాచ్ అయ్యే అమ్మాయిలు కావాలంటే పూజా హెగ్డే, సమంత, పాయ‌ల్ రాజ్‌పుత్‌, త‌మ‌న్నా మిన‌హా ఎవరూ కనిపించడం లేదు. తమన్నా ఇప్పటికే చాలా ఐటెం సాంగ్లు చేసింది. ఆమెను చూసి చూసి బోర్ కొట్టేసింది.


పూజాను తీసుకోవాలా లేదా సమంతను అడగాలా అన్న చర్చలు నడుస్తున్నాయట. పైగా సిజీ పనులు చాలా పెండింగ్.. ఇప్పటికే ఈ సినిమా సీజీ క్వాలిటీ విషయంలో నెగిటివ్ ప్రచారం జరిగింది. అందుకే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. సిజి పనులు పూర్తయితే ఆగస్టు చివరిలో లేదా సెప్టెంబర్ మొదటివారంలో విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఈ సినిమా ఓటిటిని అమెజాన్ కు... సాటిలైట్ను జీకి విక్రయించినట్లు తెలుస్తోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: