
కన్నప్ప ఈ సినిమా కోసం మంచు ఫ్యామిలీ ఎంత కష్టపడింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు . మోహన్ బాబు - మంచు విష్ణు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి మరి ఈ ప్రాజెక్టును ఫైనలైజ్ చేసి సక్సెస్ఫుల్గా సక్సెస్ అందుకోవడానికి ఒక్క మెట్టు దూరంలో ఉన్నారు. కన్నప్ప సినిమా ఈనెల 27వ తేదీ గ్రాండ్గా థియేటర్స్ రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మంచు విష్ణు అహర్నిశలు కష్టపడుతున్నారు . మంచు విష్ణు తాజాగా సినిమా ప్రమోషన్స్ కోసం ఇంటర్వ్యూ ఇచ్చారు . ఆ ఇంటర్వ్యూలోనే ఆయన కొన్ని సినిమా సీక్రెట్స్ కూడా పంచుకున్నారు .
ఇదే క్రమంలో మంచు విష్ణు సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోల వాట్సాప్ గ్రూప్ గురించి రెస్పాండ్ అయ్యారు. "టాలీవుడ్ యాక్టర్ లందరికీ ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. ఒకప్పుడు ఆ గ్రూపులో నేను కూడా ఉండేవాడిని కానీ అందులో ఎక్కువగా టాక్సిక్ అనిపించింది.. అందుకే బయటకు వచ్చేసా .. బన్నీ - రానాలనే ఈ గ్రూప్ స్టార్ట్ చేశారు . ఇందులో అమ్మాయిలు ఎక్కువగా ఉన్నారు . నాకు చాలా సిగ్గుగా అనిపించేది . అందుకే నేనే ఎగ్జిట్ అయిపోయా. ఏమైనా పని ఉంటే నాకు డైరెక్ట్ గా మెసేజ్ చేయండి రా అని రానా - బన్నీకి చెప్పా .. ఆ గ్రూప్ లో నుంచి నేను ఎగ్జిట్ అయిపోయా "అంటూ చెప్పుకొచ్చాడు .
మంచు విష్ణు ఇది చాలా సరదాగా జెన్యూన్ గా చెప్పుకొచ్చారు . కానీ కొంతమంది మాత్రం కావాలనే టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. అమ్మాయిలు ఎక్కువగా ఉన్నారు అని చెప్పి సిగ్గుపడుతూ బయటకు వచ్చావు.. మరి సినిమాలో కూడా అమ్మాయిలు ఉంటారుగా ..?? అంటూ కౌంటర్స్ వేస్తున్నారు. మరి కొంత మంది అంటే బన్నీకి - రానాకి అమ్మాయిల పిచ్చా ..? అందుకే వీళ్ళు గ్రూప్ స్టార్ట్ చేశారా ..? అంటూ తలా తొక్క లేని లాజిక్ తో కావాలనే బన్నీని ట్రోల్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో ఇప్పుడు మంచు విష్ణు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..!