టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడం లేదని ఎవరూ కూడా ప్రోత్సహించడం లేదని చాలామంది తెలుగు హీరోయిన్స్ కూడా తెలియజేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.. అయితే మరి కొంతమంది దర్శక, నిర్మాతలు మాత్రం వీరికి పిలిచి అవకాశాలు ఇచ్చిన తర్వాత సక్సెస్ అందుకున్న తర్వాత పొగరు చూపిస్తున్నారనే విధంగా మరి కొంతమంది అప్పుడప్పుడు ఏదో ఒక రూపంలో తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా మరొక హీరోయిన్ అనన్య నాగళ్ల తెలుగు సినీ పరిశ్రమపై పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.


ఇతర భాషలలో నుంచి వచ్చే వారికి తెలుగు సినీ పరిశ్రమ ఎక్కువ ఆదరణ చూపిస్తున్నారని మన వాళ్ళని పక్కన పెట్టేస్తున్నారనే విషయాన్ని మరొకసారి వినిపించింది.తెలుగు హీరోయిన్స్ కి మనవాళ్లు అవకాశాలు ఇవ్వక ఇతర భాషల వారు ఇవ్వక పోతే పరిస్థితి ఏంటి అంటూ తాను ప్రశ్నిస్తోంది. అనన్య నాగళ్ల మాట్లాడిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. మల్లేశం చిత్రం ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె.. ఖమ్మం జిల్లా వాసి అందం అభినయం ఉండడంతో కొంతకాలం హీరోయిన్ గా నిలదొక్కుకునేందుకు పలు రకాల ప్రయత్నాలు చేసింది.


అయితే ఇవేవీ కూడా వర్కౌట్ కాకపోవడంతో ఇటీవలే వెన్నెల కిషోర్ తో కలిసి శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ చిత్రంలో నటించింది. ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ విషయంలో పాల్గొన్న అనన్య ఈ విధంగా మాట్లాడింది.. తెలుగు సినీ ఇండస్ట్రీలో 20% మంది మాత్రమే తెలుగు అమ్మాయిలకు అవకాశాలు లభిస్తున్నాయి. మిగిలిన శాతం అంతా కూడా బయటనుంచి వచ్చిన వారికే అవకాశాలు వస్తున్నాయని ఆవేదనతో తెలియజేసింది. దీంతో ఇతర భాషలలో అవకాశాల కోసం ట్రై చేస్తే అక్కడ కూడా ఇదే పరిస్థితి ఉంది తెలిపింది. ఇతర భాషలు అక్కడ ఉన్నవారికి 80% అవకాశాలు ఇచ్చి మిగిలిన వారికి 20 శాతం మాత్రమే కల్పిస్తారు. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోందని తెలుపుతోంది. కేవలం ఆ 20% లోనే చాలామంది స్ట్రాంగ్ గా నిలబడి ఫైట్ చేస్తున్నారు వాళ్ళందర్నీ చూస్తే తనకు చాలా గర్వంగా ఉన్నదంటూ తెలిపింది. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు తక్కువ అయినప్పటికీ కూడా ప్రయత్నిస్తూ ఉండడం చాలా గర్వంగా ఉందని తెలిపింది..

మరింత సమాచారం తెలుసుకోండి: