
తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు బయటకు వచ్చాయి. నితిన్ వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. ఆయన గత చిత్రాలు `రాబిన్ హుడ్`, `ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్`, `మాచెర్ల నియోజకవర్గం` బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. అయినప్పటికీ తమ్ముడు సినిమాకు భారీ రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇప్పటివరకు బయటకు వచ్చిన కంటెంట్, ప్రమోషన్స్ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి.
ఫలితంగా తమ్ముడు ఏపీ మరియు తెలంగాణలో రూ. 20 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకుంది. అలాగే వరల్డ్ వైడ్ గా ఈ సినిమా టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 24 కోట్లు. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 25 కోట్ల రేంజ్ లో ఉంది. సో.. నితిన్ తమ్ముడు చిత్రంతో క్లీన్ హిట్ కొట్టాలంటే రూ. 25 కోట్ల రేంజ్ లో షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకోవాల్సి ఉంటుంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు