
ఈ ఏడాది మెగా ఫ్యాన్స్ ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో విశ్వంభర మూవీ ఒకటి. ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. విశ్వంభర మూవీ రిలీజ్ డేట్ విషయంలో ఎన్నో సందేహాలు నెలకొనగా ఈ సినిమా తెలుస్తున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ నెల 18వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. సెప్టెంబర్ నెల 25వ తేదీన ఓజీ, అఖండ2 సినిమాలు విడుదల కానున్న సంగతి తెలిసిందే.
మెగా, నందమూరి ఫ్యాన్స్ కు భారీ షాక్ తగులుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కేవలం వారం రోజుల గ్యాప్ లో విశ్వంభర, ఓజీ సినిమాలు విడుదలైతే రెండు సినిమాలకు నష్టం కలుగుతుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. దసరా సమయంలో మూడు సినిమాలు విడుదలైతే మూడు సినిమాలకు థియేటర్ల విషయంలో కొంతమేర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు.
విశ్వంభర మూవీ పాన్ ఇండియా మూవీగా విడుదల కానుండగా దాదాపుగా 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. త్వరలో విశ్వంభర సినిమా ప్రమోషన్స్ మొదలయ్యే అవకాశం అయితే ఉంది. విశ్వంభర సినిమాలో గ్రాఫిక్స్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఉండనుందని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
విశ్వంభర సినిమాకు మల్లిడి వశిష్ట దర్శకుడు అనే సంగతి తెలిసిందే. విశ్వంభర సినిమాతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తానని చిరంజీవి కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఈ సినిమా సక్సెస్ సాధించడం యువి క్రియేషన్స్ బ్యానర్ కు సైతం కీలకమనే సంగతి తెలిసిందే. చిరంజీవి కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాగా ఈ సినిమా నిలిచింది. త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి. విశ్వంభర సినిమా సక్సెస్ సాధిస్తే మెగా ఫ్యాన్స్ ఆనందానికి సైతం అవధులు ఉండవు.