గాలి జనార్దన్ కుమారుడు అయినటువంటి కిరీటి తాజాగా జూనియర్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమణి శ్రీలీల హీరోయిన్గా నటించగా ... రాధాకృష్ణా రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తి అయింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పనులు అన్ని పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని ఈ నెల 18 వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించడంతో ఈ మూవీ మ్యూజిక్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి "వైరల్ వయ్యారి" అంటూ సాగే సాంగ్ ను విడుదల చేసింది. పక్కా మాస్ బిట్ ట్యూన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సాంగ్ జనాలను బాగానే ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ సాంగ్లో శ్రీలీల తన అందాలతో , డ్యాన్స్ తో ప్రేక్షకులకు మంచి కిక్ ఎక్కించేలా ఉంది. తాజాగా ఈ మూవీ బృందం వారు విడుదల చేసిన "వైరల్ వయ్యారి" లిరికల్ వీడియోలో కూడా శ్రీ లీల అదిరిపోయే రేంజ్ లో డాన్స్ చేస్తూ , తన అందాలతో ప్రేక్షకులకు మంచి కిక్ ను ఎక్కిస్తుంది. ఈ మధ్య కాలంలో శ్రీలీల నటించిన దాదాపు ప్రతి సినిమాలో కూడా కనీసం ఒక్క డ్యాన్స్ నెంబర్ అయినా ఖచ్చితంగా ఉండడం , అందులో తన డాన్స్ తో , అందంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం జరుగుతుంది.

ఇక జూనియర్ మూవీ లో కూడా వైరల్ వయ్యారి సాంగ్లో ఈమె అదే స్థాయిలో రెచ్చిపోయినట్లు కనిపిస్తుంది. దానితో కొంత మంది జనాలు శ్రీ లీల తో సినిమాలు చేస్తున్న దర్శకులు ఆమె అందం , డాన్స్ పై కాకుండా ఆమె నటనపై కూడా ఫోకస్ పెడితే బాగుంటుంది అని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కిరీటి ఈ మూవీ తోనే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మరి ఈ సినిమాతో ఈయనకు ఎలాంటి విజయం దక్కుతుందో , శ్రీ లీల ఈ మూవీ తో ఏ స్థాయి క్రేజ్ ను దక్కించుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: