దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో `SSMB 29` వర్కింగ్ టైటిల్ తో ఓ బిగ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత కె ఎల్ నారాయణ అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే ఎపిక్ అడ్వెంచర్ ఇది. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా ఎంపిక అయింది. పృథ్విరాజ్ సుకుమారన్ విల‌న్ గా క‌నిపించ‌బోతున్నార‌నే టాక్ ఉంది.


అయితే తాజాగా మ‌రో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెర‌పైకి వ‌చ్చింది. ఈ  చిత్రంలో మ‌హేష్ బాబుకు తండ్రిగా  కోలీవుడ్ స్టార్ యాక్ట‌ర్‌ ఆర్. మాధవన్ ను తీసుకున్నార‌ట జ‌క్క‌న్న‌. అంతకుముందు ఆ పాత్ర కోసం నానా పాటేకర్ ను సంప్ర‌దించ‌గా.. ఆయ‌న తిర‌స్క‌రించ‌డం జ‌రిగింది. ఇప్పుడు మాధ‌వ‌న్ ను మ‌హేష్ బాబుకు తండ్రిగా ఫైన‌ల్ చేశార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలోనే మ‌హేష్, మాధ‌వ‌న్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ చూసి సినీ ప్రియులు షాక్ అవుతున్నారు.


మ‌హేష్ బాబు వ‌య‌సు 50 కాగా.. మాధ‌వ‌న్ కు 55 ఏళ్లు. ఇంచుమించు ఒకే వ‌య‌సు వారు. పైగా మాధ‌వ‌న్ ఒక‌ప్ప‌టి అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడు. ఆయ‌న్ను మ‌హేష్ బాబుకు తండ్రిని చేసేయ‌డంతో కొంద‌రు హ‌ర్ట్ అవుతున్నారు. అయితే ఈ మ‌ధ్య కాలంలో డిఫరెంట్ పాత్రల వైపు మాధ‌వ‌న్ ఎక్కువ‌గా మొగ్గు చూపుతున్నారు. ఆ పాత్రల కోసం తన బాడీని, లుక్ ని కూడా మార్చుకుంటున్నారు. ఇక రాజ‌మౌళి చిత్రంలోనూ మహేష్ తండ్రిగా కాస్త ముసలి పాత్రలో మాధ‌వ‌న్ కనిపిస్తార‌ని.. ఆయ‌న క్యారెక్ట‌ర్ క‌థ‌లో స్ట్రాంగ్ గా ఉంటుంద‌ని అంటున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: