
కీర్తి సురేష్ కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస సినిమాలతో మంచి విజయాలను అందుకున్నది. తెలుగులో నేను శైలజ సినిమాతో ఎంట్రీ ఇవ్వగా తెలుగు ఆడియన్స్ ను కూడా బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత మహానటి సినిమాతో నేషనల్ అవార్డు అందుకోవడంతో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను అందుకుంది. వివాహమనంతరం కీర్తి సురేష్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన సక్సెస్ కాలేదు. అయితే పెళ్లి తర్వాత ఆఫర్లు పెద్దగా రావడంలేదని ఒక న్యూస్ వినిపిస్తోంది.
అందుకే ఈమె ఓటీటిలో సినిమాలను విడుదల చేస్తోందనే విధంగా వినిపిస్తున్నాయి. అయితే ఇటీవలే కీర్తి సురేష్ ఒక ఈవెంట్ కోసం మధురై కి వెళ్ళగా అక్కడ చూసిన చాలామంది అభిమానులు..TVK అంటూ విజయ్ దళపతి పెట్టిన పేరును తెగ వినిపించేలా చేశారట. కీర్తి సురేష్ అభిమానులు కూడా ఇలా అరవడానికి ముఖ్య కారణం వీరిద్దరూ గతంలో చేసిన సినిమాలే. అంతేకాకుండా అటు విజయ్ దళపతి తో కూడా తనకి ఉన్న స్నేహబంధం గురించి చెప్పాల్సిన పనిలేదు. మధురైలో TVK పార్టీ గురించి కేకలు వేసిన కూడా కీర్తి సురేష్ పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఆమె పొలిటికల్ పైన ఇంట్రెస్టింగ్ ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి.. త్వరలో విజయ్ పార్టీలోకి చేరబోతుందనే విధంగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.ఒకవేళ ఎంట్రీ ఇస్తే.. కీర్తి సురేష్ ఎక్కడ నిలబడుతుందా అనే విషయంపై అభిమానులు చాలా ఎక్సైటింగ్గా ఎదురు చూస్తున్నారు. మరి ఈ విషయంపై కీర్తి సురేష్ ఎలా స్పందిస్తుందో చూడాలి