ప్రముఖ స్టార్ బ్యూటీ నిధి అగర్వాల్ దాదాపు మూడేళ్ల గ్యాప్ అనంతరం మళ్లీ `హరిహర వీరమల్లు` మూవీతో సిల్వర్ స్క్రీన్ పై మెరవబోతుంది. దాదాపు ఐదేళ్ల క్రితం పట్టాలెక్కిన ఈ చిత్రం ఫైనల్ గా జూలై 24న గ్రాండ్ రిలీజ్ కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఫ‌స్ట్ టైమ్ నిధి స్క్రీన్ షేర్ చేసుకుంది. వీర‌మ‌ల్లు కోసం భరతనాట్యంతో పాటు గుర్రపు స్వారీ వంటి ప్రత్యేక శిక్షణలు తీసుకుంది.


రిలీజ్ డేట్‌ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో నిధి ఫుల్ యాక్టివ్ అయింది. బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు ఇస్తోంది. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో నిధి అగ‌ర్వాల్ మాట్లాడుతూ.. త‌నకు మాస్ హీరోయిన్ గా గుర్తింపు పొందాలని ఉందంటూ మనసులో కోరికను బయటపెట్టింది. ఈ క్రమంలో యాంకర్ సూటిగా ఓ ప్రశ్న వేసింది. మాస్ ఇమేజ్‌ రావాలంటే బికినీ, లిప్ లాక్, ఇంటిమేట్ సన్నివేశాలు చేయాల్సి ఉంటుంది.. అందుకు మీరు రెడీనా? అని ప్ర‌శ్నించ‌గా.. నిధి అలాంటివి తాను చేయనని బోల్డ్ గా స‌మాధానం ఇచ్చింది.


`నాకంటూ కొన్ని లిమిట్స్ ఉన్నాయి. నా పేరెంట్స్ తో కలిసి చూడలేని సన్నివేశాల్లో నేను నటించను. లిప్‌లాక్‌, ఇంటిమేట్ సీన్స్ చేస్తేనే మాస్ హీరోయిన్ అవుతారు అనుకుంటే పొరపాటే. కష్టపడి వ‌ర్క్ చేస్తాను. మంచి కథలు ఎంచుకోవడానికి ప్రయత్నిస్తాను` అంటూ నిధి అగర్వాల్ పేర్కొంది. ప్ర‌స్తుతం ఆమె కామెంట్స్ నెట్టింట వైర‌ల్ గా మారాయి. కాగా, నిధి అగ‌ర్వాల్ చేతిలో ఉన్న మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ `ది రాజ్ సాబ్‌`. ప్ర‌భాస్‌, మారుతి కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ హార‌ర్ కామెడీ ఫిల్మ్ డిసెంబ‌ర్ 5న రిలీజ్ కానుంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: