
ఆదిత్య 369 సీక్వెల్ బాధ్యతలను క్రిష్ తీసుకున్నారని సమాచారం. బాలయ్య ఒకే సమయంలో రెండు సినిమాలలో నటించనున్నారని తెలుస్తోంది. బాలయ్య రెమ్యునరేషన్ సైతం ప్రస్తుతం 40 కోట్ల రూపాయల రేంజ్ లో ఉన్న సంగతి తెలిసిందే. బాలయ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు. బాలయ్య తన సినిమాల లుక్స్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
హరిహర వీరమల్లు ఆశించిన ఫలితాన్ని అందుకోకపోయినా క్రిష్ పై ఉన్న నమ్మకంతో బాలయ్య ఛాన్స్ ఇచ్చారని తెలుస్తోంది. క్రిష్ పారితోషికం కూడా ఒకింత భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే. గతంలో బాలయ్య క్రిష్ కాంబినేషన్ లో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. దర్శకుడు క్రిష్ వేగంగానే ఈ సినిమాను పూర్తీ చేయబోతున్నారని సమాచారం అందుతోంది.
ఆదిత్య 999 గురించి త్వరలో పూర్తిస్థాయిలో క్రేజీ అప్ డేట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ సినిమాకు నిర్మాత ఎవరనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది. బాలయ్య కెరీర్ ప్లాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. బాలయ్యను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. బాలయ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు. స్టార్ హీరో బాలయ్య రేంజ్ సైతం అంతకంతకూ పెరుగుతోంది.