ప‌వ‌ర్ లో ఉంటే అంద‌రి క‌ళ్లు వాళ్ల మీదే ఉంటాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన హరిహర వీరమల్లు సినిమా కోసం చివరి వారం రోజులు చాలా కష్టపడ్డారు.. అన్ని ఊళ్ళు తిరిగి ప్రచారం చేశారు. సినిమాకి రేట్లు వచ్చాయి. కానీ సమస్య అయింది. సినిమా అంచనాలు అందుకోలేదు.. సరి కదా మినిమం వసూళ్లు కూడా రాబట్టలేకపోయింది. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పవన్ తన సినిమా కోసం తిరగటానికి ప్రభుత్వ నిధులు ఖర్చు అయ్యాయని.. అధికార దుర్వినియోగం అయిందని కోర్టులో కేసు పడింది. దానిమీద వాదాలు .. వాయిదాలు నడుస్తున్నాయి. దీనివల్ల ఏదో అయిపోతుందని అనుకోవటానికి పెద్దగా ఆస్కారం లేదు. కానీ ఈ కేసు వల్ల పవన్ ఓజీ సినిమా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఓజీ సినిమాను చాలా అంటే చాలా భారీ రేట్లకు అమ్మేశారు.


అందువల్ల ప్రీమియర్ల కు కనీసం 500 లేదా 1000 రూపాయలు రేటు పెట్టాల్సి ఉంది. అలాగే తొలివారం భారీ రేట్లు ఉండాల్సి ఉంటుంది. నిర్మాత అదనపు రేట్ల కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలి.. అనుమతులు రావడం పెద్ద కష్టం కాదు .. అన్ని సినిమాలుకు ఇస్తున్నారు ఓజికి కూడా ఇస్తారు. రెండో విషయం పబ్లిసిటీ. హరిహర వీరమల్లు సినిమాకు తిరిగినట్టు పవన్ అన్ని ఊర్లు తిరిగి అవకాశం లేదు. ఇప్పటికే సినిమాపై ఇన‌ప్ బ‌జ్‌ ఉంది. విజయవాడలో , హైదరాబాదులో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఎలాగూ ఉంటుంది. మొత్తం మీద ఓజీ సినిమా విషయంలో రెండు రకాలుగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎవరో ఏదో అనుకుంటారని పవన్ ఎంత మాత్రం వెనక్కు తగ్గరు. ఇక అదనపు రేట్లు ప్రీమియర్ షోలు కచ్చితంగా ఉంటాయి. మరి ఓ జి విధ్వంసం బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా ఉంటుంది అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: