సినిమా ఇండస్ట్రీ లో హిట్టు దక్కిన దర్శకులకు అద్భుతమైన క్రేజ్ ఉంటుంది. అదే దర్శకుడు కనుక వరుసగా అపజయాలను అందుకున్నట్లయితే ఆయన క్రేజ్ పడిపోతూ ఉంటుంది. హిట్లు ఉన్న సమయంలో ఓకే అయినా ప్రాజెక్టులు కూడా ఫ్లాపులు రాగానే క్యాన్సల్ అయిన దాఖలాలు కూడా ఇండస్ట్రీ లో చాలానే ఉన్నాయి. ఇకపోతే కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో లోకేష్ కనగరాజ్ ఒకరు. ఈయన దర్శకుడిగా కెరీర్ ను ప్రారంభించిన కొత్తలోనే అద్భుతమైన సినిమాలను రూపొందించి వాటితో సూపర్ సాలిడ్ క్రేజ్ ను ఇండియా వ్యాప్తంగా సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈ మధ్య కాలంలో మాత్రం ఈయన దర్శకత్వం వహించిన సినిమాలు ప్రేక్షకులను అద్భుతమైన స్థాయిలో ఆకట్టుకోవడం లేదు.

కొంత కాలం క్రితం ఈయన తలపతి విజయ్ హీరోగా రూపొందిన లియో అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. బారి అంచనాల నడమ విడుదల ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ మూవీ తర్వాత లోకేష్ కనగరాజ్ , సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా కూలీ అనే మూవీ ని రూపొందించాడు. ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయ్యింది. ఈ సినిమాలో ఆమీర్ ఖాన్ ఓ కీలకమైన పాత్రలో నటించాడు. కూలీ సినిమా తర్వాత ఆమీర్ , లోకేష్ కాంబోలో మూవీ రాబోతుంది అని భారీ ఎత్తున వార్తలు వచ్చాయి.

ఇక కూలీ సినిమాలో ఆమీర్ పాత్రకు కూడా పెద్దగా రెస్పాన్స్ రాకపోవడంతో ఆమీర్ , లోకేష్ కాంబోలో సినిమా క్యాన్సిల్ అయింది అని ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే లోకేష్ చాలా కాలం క్రితం కార్తీ హీరోగా ఖైదీ అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ కి సీక్వెల్ ఉండబోతుంది అని లోకేష్ చాలా సార్లు చెప్పాడు. ఈ సినిమా సీక్వెల్ గురించి మాత్రం చాలా మంది ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

lk