సినిమా ఇండస్ట్రీలో ప్రతిరోజూ ఎన్నో విచిత్ర సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. అలాంటి వాటిల్లో ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఇద్దరు స్టార్ హీరోలతోనూ ఒక అందాల భామ విభిన్నమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ భామ ఒక సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ప్రేయసిగా నటించి తన అందం, నటనతో అందరినీ మెప్పించగా.. మరొక సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి అక్క పాత్రలో నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ప్రస్తుతం రామ్ చరణ్ తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న పెద్ది సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఆయన సరసన రొమాన్స్ చేయబోతుంది. ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా మేకర్స్ కూడా ఈ చిత్రం ఖచ్చితంగా అభిమానులను వేరే స్థాయిలో ఆకట్టుకుంటుందనే నమ్మకంతో ఉన్నారు. అయితే, రామ్ చరణ్ సినిమాపై ఆసక్తికరమైన అప్‌డేట్స్ వచ్చేస్తున్న తరుణంలో సోషల్ మీడియాలో మరో ఆసక్తికరమైన వార్త హాట్ టాపిక్‌గా మారింది. పవన్ కళ్యాణ్‌కి ప్రేయసిగా ‘తీన్మార్’ సినిమాలో నటించిన అందాల తార కృతీ కర్బంద గురించి నెట్‌లో పాత జ్ఞాపకాలు మళ్లీ వైరల్ అవుతున్నాయి. ఆ సినిమాలో కృతీ కర్బంద - పవన్ కళ్యాణ్ సరసన కనిపించి తన అందంతోనే కాదు, సహజమైన నటనతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. పవన్‌కి ప్రేయసిగా ఆమె నటించిన ఆ క్యూట్ రోల్ అభిమానుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.



ఆ తర్వాత కృతీ కర్బంద ‘బ్రూస్లీ’ సినిమాలో రామ్ చరణ్ అక్క పాత్రలో కనిపించి మరోసారి తన నటనతో మెప్పించింది. ఆమె నటనతో పాటు ఆ సోదర భావాన్ని అద్భుతంగా ప్రదర్శించిన తీరు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాకుండా, రామ్ పోతినేని తో ‘ఒంగోలు గిత్త’ వంటి సినిమాల్లో కూడా ఆమె తనదైన అందం, స్టైల్, నటనతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. కేవలం స్టార్ హీరోల సినిమాలే కాకుండా, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘3డ్’ సినిమాలో కూడా కృతీ కర్బంద తన గ్లామర్‌తో ఆకట్టుకుంది.


అయితే, ఇన్ని సినిమాల్లో నటించినప్పటికీ కృతీ కర్బందకి తెలుగులో పెద్దగా బ్రేక్ రాలేదు. ఆమె తన నటన, అందం, ఫ్యాషన్ సెన్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకోలేకపోయింది. ఈ పరిస్థితిలో బాలీవుడ్‌లో ఎక్కువ అవకాశాలు అందుకోవడంతో ఆమె హిందీ సినిమాల వైపు మళ్లింది. ఇప్పుడు కృతీ కర్బంద తన వ్యక్తిగత జీవితంలో హ్యాపీగా సెటిల్ అయిపోయింది. ఆమె పెళ్లి చేసుకుని కుటుంబ జీవితాన్ని ఆనందంగా కొనసాగిస్తూ ఉన్నారు. ఇలా ఒకే హీరోయిన్ పవన్ కళ్యాణ్‌కి ప్రేయసిగా, రామ్ చరణ్‌కి అక్కగా నటించి ఇండస్ట్రీలో తనదైన గుర్తింపు సంపాదించుకోవడం చాలా అరుదైన విషయం అని సినీ ప్రేమికులు కామెంట్ చేస్తున్నారు. అందుకే కృతీ కర్బందపై ఉన్న పాత క్లిప్స్, ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: