ఆసియా కప్ 2025 తాజాగా ప్రారంభం అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఆసియా కప్ 2025 లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. ఈ 8 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఏ నాలుగు జట్లు ఉండగా , గ్రూప్ బి లో నాలుగు జట్లు ఉన్నాయి. గ్రూప్ ఏ లో టాప్ లో నిలిచిన రెండు జట్లు , గ్రూప్ బి లో టాప్ లో నిలిచిన రెండు జట్లు సేమిస్ కి చేరుతాయి. ఇక అక్కడ టాప్ లో నిలిచిన జట్లు ఫైనల్ కి చేరుతాయి. ఇకపోతే భారతదేశ క్రికెట్ అభిమానులు ఇండియా , పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే చాలు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు.

ఆసియా కప్ లో భారత్ , పాకిస్తాన్ మ్యాచ్ నవంబర్ 14 వ తేదీన జరగనుంది. నవంబర్ 14 వ తేదీన ఆసియా కప్ 2025 లో భాగంగా ఇండియా , పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుండడంతో ఆసియా కప్ టోర్నీలో ఎవరి పరిస్థితి ఎలా ఉంది ..? ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి అనే దానిపై అనేక సమీకరణాలు మొదలు అయ్యాయి. ఇక ఇప్పటివరకు ఆసియా కప్ రికార్డుల్లో చూసుకున్నట్లయితే ఇండియాదే క్లియర్ గా పై చేయి కనబడుతుంది. ఇప్పటివరకు భారత జట్టు ఆసియా కప్ టోర్నీని ఎనిమిది సార్లు దక్కించుకుంది. అందులో వన్డే ఫార్మేట్ లో ఏడు సార్లు ఇండియా గెలుపొందగా, టీ 20 ఫార్మేట్ లో ఒక సారి గెలుపొందింది. ఇక పాకిస్తాన్ ఇప్పటివరకు రెండు సార్లు మాత్రమే ఆసియా కప్ ను గెలుపొందింది.

టీ 20 ఫార్మేట్ లో ఈ జట్టు ఒక్క.సారి కూడా గెలుపొందలేదు. ఆసియా కప్ టోర్నీ లో మొత్తంగా ఇండియా , పాకిస్తాన్ 19 సార్లు తలపడ్డాయి. ఇందులో పది సార్లు టీమిండియా గెలిస్తే , పాకిస్తాన్ ఆరు సార్లు గెలిచింది. ఇక ఇండియా , పాకిస్తాన్ తలపడిన మూడు మ్యాచ్ లలో ఫలితం తేలలేదు. ఇలా ఆసియా కప్ ఫార్మేట్ లో పాకిస్తాన్ పై ఇండియా లీడ్ లో ఉంది. దానితో ఈ సారి కూడా పాకిస్తాన్ పై ఇండియా గెలుస్తుంది అని ఆసియా కప్ కూడా సాధిస్తుంది అని ఇండియన్స్ గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: