టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒకరు. ఈయన టాలీవుడ్ మాస్ దర్శకులలో ఒకరు అయినటువంటి వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన అల్లుడు శీను అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈయనకు మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో వచ్చింది. ఆ తర్వాత ఈయన ఎన్నో కమర్షియల్ సినిమాలలో నటించినా పెద్దగా విజయాలు మాత్రం ఈ నటుడుకి దక్కలేదు. అలాంటి సమయం లోనే ఈయన రాక్షసుడు అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో హీరో గా నటించాడు. అనుపమ పరమేశ్వరన్ ఈ మూవీ లో హీరోయిన్గా నటించింది.

సినిమా ఈయనకు మంచి విజయాన్ని , మంచి గుర్తింపును తీసుకువచ్చింది. ఈ సినిమా తర్వాత కూడా ఈయన అనేక సినిమాలలో నటించాడు. కానీ ఈయనకు రాక్షసుడు సినిమా తర్వాత నటించిన ఏ సినిమా ద్వారా కూడా ఆ స్థాయి విజయం దక్కలేదు. తాజాగా ఈయన కిష్కిందపురి అనే సినిమాలో హీరో గా నటించాడు. అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. హార్రర్ జోనర్ మూవీ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

ఇకపోతే ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ నుండి మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు అన్నీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై జనాల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంది. తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు ఇప్పటివరకు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి అనే విషయాన్ని ప్రకటిస్తూ అధికారికంగా ఓ పోస్టర్ను విడుదల చేసింది. ఈ పోస్టర్ ప్రకారం ఈ సినిమాకు 10 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 27 కోట్ల గ్రాస్ కలెక్షన్ దక్కినట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

bss