పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఓజి అనే పవర్ఫుల్ గ్యాంగ్ స్టార్ మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ప్రియాంక అరుల్ మోహన్ ఈ సినిమాలో పవన్ కి జోడిగా నటించగా ... సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించగా ... శ్రేయ రెడ్డి , అర్జున్ దాస్ ఈ మూవీ లో కీలక పాత్రలలో నటించారు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ మూవీ ని డి వి వి దానయ్య నిర్మించాడు. ఈ సినిమాను సెప్టెంబర్ 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

ఇకపోతే సెప్టెంబర్ 25 వ తేదీన అర్థరాత్రి నుండే ఈ సినిమాకు సంబంధించిన షో లను ప్రదర్శించనున్నట్లు మూవీ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. కానీ ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను 25 వ తేదీన అర్ధరాత్రి నుండి కాకుండా 24 వ తేదీ రాత్రి నుండి ప్రదర్శించడానికి ప్రత్యేక జీవోను తీసుకువచ్చారు. ఓజి సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను 24 వ తేదీన రాత్రి 10 నుండే ప్రదర్శించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ప్రత్యేక జీవోను విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం 24 వ తేదీ రాత్రి 10 గంటలకు ఓజి సినిమాకి సంబంధించిన షో లు కొన్ని థియేటర్లలో ప్రదర్శించనున్నారు.

ఇలా ఒక జీవోను తీసుకు వచ్చి మరి సినిమా విడుదలకు ముందు రోజు రాత్రి ఓ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను ప్రదర్శించడం ఇది మొదటి సారి అని తెలుస్తుంది. ఏదేమైనా కూడా ప్రస్తుతానికి ఓజి సినిమాపై పవన్ అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటున్న చూడాలి. ఈ మూవీ కి గనుక మంచి టాక్ వచ్చినట్లయితే ఈ సినిమా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: